Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం ఓటీటీలో కొత్త రికార్డ్ సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో 13 వారల పాటు ట్రెండింగ్ లో ఉన్న తొలి సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
Lucky Baskhar

Lucky Baskhar

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ (Dulkar Salman) హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సోషల్ డ్రామా 'లక్కీ భాస్కర్' (Lucky Baskhar). విడుదలై 4 నెలలు దాటినా ప్రేక్షకులలో ఈ సినిమా పై క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. బ్యాంకింగ్ వ్యవస్థ, అవినీతి అంశాలతో సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓటీటీ, టీవీ ఇలా అన్ని ప్లాట్ ప్లాట్ ఫార్మ్స్ పై రికార్డ్ వ్యూస్ నమోదు చేస్తోంది. ఇటీవలే టీవీలో ప్రీమియర్ చేయగా.. 8.4తో అద్భుతమైన టిఆర్పి రేటింగ్ నమోదు చేసింది. ఏ తెలుగు హీరో సినిమాకు కూడా ఇంత రేటింగ్ రాలేదు. 

Also Read:  Samantha: "సంథింగ్ స్పెషల్" అంటూ సమంత పోస్ట్ ...పెళ్లి గురించేనా..? - Rtvlive.com

Also Read :  SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

నెట్ ఫ్లిక్స్ లో రికార్డు 

అయితే తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది 'లక్కీ భాస్కర్'. నెట్ ఫ్లిక్స్ (Netflix) ప్లాట్ ఫార్మ్ పై 13 వారల పాటు కంటిన్యుయస్ గా ట్రెండింగ్ ఉన్న తొలి సౌత్ ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ పంచుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ  మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. 

Also Read: Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా

Also Read :  హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే

Advertisment
Advertisment