/rtv/media/media_files/2025/03/10/WprlzNb7pVTyNr5zfXUf.jpg)
Photograph: (Rashmi Gautham Emotional Post)
బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Goutam) జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ నుంచి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. యాంకర్‌గా చేస్తునే పలు షోలలో అలరించడంతో పాటు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. యాంకర్ సుధీర్ (Sudheer), రష్మి జంటకు మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ఎన్నో షోలు చేయడంతో పాటు ప్రోగామ్స్‌లో కనిపించారు. ఈ జంటకి రీల్ పెళ్లి కూడా జరిగింది. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
ఇది కూడా చూడండి: HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్
తన పెట్ గురించి ఎమోషనల్ అవుతూ..
దీంతో పలుమార్లు ఈ వార్తలపై స్పందించారు. తాము స్నేహితులమని, వారి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే రష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. జంతువులను సొంత మనుషులుగా భావించి వాటి ఆలనా, పాలనా చూసుకుంటుంది. అయితే తాజాగా రష్మీ పెట్ మృతి చెందింది. ఆ పెట్ అస్థికలు గోదావరి నదిలో కలిపిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఇది కూడా చూడండి: ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!
ఈ సందర్భంగా తన పెట్ వీడియోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నిన్ను ప్రేమించే అవకాశం కోసం నేను జీవితాంతం మిస్ అవుతూనే ఉంటానని.. పునర్జన్మ ఉంటే నువ్వు పుడతావని కోరుకుంటున్నానని తెలిపింది. నన్ను క్షమించు.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని.. ఫ్రీగా వెళ్లు చుట్కీ గౌతమ్ అని ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.