/rtv/media/media_files/2025/03/03/qG1fu2l64kBaxq7Ufl7V.jpg)
anora film
97వ ఆస్కార్ అవార్డుల (Oscar Awards 2025) వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు హాలీవుడ్ సినీతారలతో పాటు సినిమా రంగానికి చెందిన టెక్నీషియన్స్, డైరెక్టర్స్, నటీనటులు హాజరయ్యారు. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును.. ప్రతీ ఆర్టిస్ట్, టెక్నీషియన్ జీవితంలో ఒక్కసారైనా అందుకోవాలని అనుకుంటారు. అయితే ఆస్కార్ 2025 వేడుకల్లో అమెరికన్ ఫిల్మ్ 'అనోరా' (Anora) అందరి దృష్టిని ఆకర్షించింది. గతరాత్రి ఆస్కార్ వేదిక పై ఈ సినిమా పేరు మారుమోగింది.
Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!
ఐదు కేటగిరీల్లో అవార్డులు
'అనోరా' చిత్రం దాదాపు ఐదు విభాగాల్లో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ సినిమా, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ ఇలా ఈ చిత్రానికి అవార్డుల పంట పండింది. 'ది ఫ్లోరిడా ప్రాజెక్ట్' ఫేమ్ సీన్ బేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
Now that’s a fairy-tale ending! Congratulations to Sean Baker on winning Best Directing for ANORA. #Oscars pic.twitter.com/byyQyxfW4R
— The Academy (@TheAcademy) March 3, 2025
Also Read : అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన విరాట్ కోహ్లీ.. VIDEO VIRAL!
వేశ్యతో ప్రేమలో పడిన కథ..
రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఒక వేశ్య కథ నేపథ్యంలో సాగుతుంది. రష్యాకు చెందిన ఒక డబ్బున్న అబ్బాయి చదువు కోసం అమెరికా వస్తాడు. ఈ క్రమంలో 23ఏళ్ళ వేశ్యను కలిసిన అతను.. ఆమెతో ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. ఈ పెళ్లిని ఆంగీకరించని కుమారుడి తల్లిదండ్రులు తిరిగి అతడిని రష్యా తీసుకెళ్తారు. ఆ తర్వాత వేశ్య ఏం చేసింది? అతడి వదిలేసిందా? లేదా అతడికి కోసం వెతుక్కుంటూ వెళ్లిందా? అనేది స్టోరీ.
Also Read : బీరు లోగో మార్చినందుకే కంపెనీకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?
అనోరా అవార్డులు
- ఉత్తమ సినిమా- అనోరా
- ఉత్తమ నటి- మైకీ మ్యాడిసన్ (అనోరా)
- బెస్ట్ డైరెక్టర్- సీన్ బేకర్ (అనోరా)
- ఉత్తమ స్క్రీన్ ప్లే- అనోరా (సీన్ బేకర్)
- ఉత్తమ ఎడిటింగ్- సీన్ బేకర్ (అనోరా)
Also Read: Oscar Awards 2025: ప్రియాంక చోప్రాకు ఆస్కార్ జస్ట్ మిస్.. 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్!