BREAKING: కూలిన కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్.. నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కోల్ట్ స్టోరేజ్ బిల్డింగ్‌లో కొంత భాగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కోల్ట్ స్టోరేజ్ బిల్డింగ్‌లో కొంత భాగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మహారాష్ట్రలోని కొహ్లాపూర్‌లో ఉన్న జ్యోతిబా ఆలయంలో సోమవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 20 మంది పూజారులు ఇద్దరు భక్తులపై తీవ్రంగా దాడి చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. కోళికోడ్ జిల్లాలోని షిగెల్లా అనే వ్యాధి వ్యాప్తిస్తోంది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ఎరంజికల్ అనే ప్రాంతంలో తాజాగా 12 మందికి ఈ వ్యాధి సోకింది.
భార్య వంట చేయని కారణంతో విడాకుల కోరిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు గట్టి కౌంటర్ ఇచ్చింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యత ఉంటుందని తెలిపింది.
గల్ఫ్ దేశాల్లో వాణిజ్య చెల్లింపులకు సంబంధించి భారత్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆయా దేశాల స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు చేసే మార్గాలు అన్వేషిస్తోంది.
మతపరమైన ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాల ఊరేగింపుల్లో డీజీ పాటలు, ఐటం సాంగ్స్ పెడుతుంటారు. చెవులు చిల్లులు పడేలా మోత మోగిస్తుంటారు.అయితే ఇలాంటి కార్యక్రమాల్లో డీజే పాటలు, ఐటం సాంగ్స్‌ను వినిపించే డీజేలపై నిషేధం విధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.
కశ్మీర్ మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గత రెండ్రోజులుగా మంచు తుఫానుతో పాటు వర్షం కూడా కురుస్తోంది. దీంతో జమ్మూ కశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జన జీవనం స్తంభించిపోయింది. మార్చి 20 దాకా ఇలాంటి వాతావరణమే ఉంటుందని IMD ప్రకటించింది.
అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ సీఎం స్టాలిన్‌పై విమర్శలు చేస్తూ నోరు జారారు. నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా '' అంటూ ప్రశ్నించారు. హీరోయిన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.