Kerala: కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి.. 12 మందికి సోకిన వైరస్.. భయాందోళనలు స్థానికులు

కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. కోళికోడ్ జిల్లాలోని షిగెల్లా అనే వ్యాధి వ్యాప్తిస్తోంది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ఎరంజికల్ అనే ప్రాంతంలో తాజాగా 12 మందికి ఈ వ్యాధి సోకింది.

New Update
Shigella Cases Rise In Kozhikode, 12 More Test Positive As Authorities Intensify Measures

Shigella Cases Rise In Kozhikode, 12 More Test Positive As Authorities Intensify Measures

కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. కోళికోడ్ జిల్లాలోని షిగెల్లా అనే వ్యాధి వ్యాప్తిస్తోంది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ఎరంజికల్ అనే ప్రాంతంలో తాజాగా 12 మందికి ఈ వ్యాధి సోకింది. కొన్నిరోజుల క్రితమే నలుగురికి ఈ వ్యాధి సోకగా అందులో ఓ చిన్నారి మృతి చెందింది. అయితే కొత్తగా పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్లలో అత్యధిక మంది బాధిత కుటుంబ సభ్యులే ఉన్నారు. 

Also Read: కేంద్రం వలస కూలీలకు వరం.. ఫ్రీగా LPG గ్యాస్ సిలిండర్లు పంపిణీ!

అయితే ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని అక్కడి అధికారులు చెబుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానిత లక్షణాలు ఉన్నవాళ్లని గుర్తించేందుకు ఇంటింటా సర్వే చేస్తున్నాయి. ఈ వ్యాధి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది. 
 

షిగెల్లా వ్యాధి అంటే 

షిగెల్లా అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది తీవ్రమైన ప్రేగు సంబంధిత అంటువ్యాధి. రక్తం, చీముతో కూడిన విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరం దీని లక్షణాలు. కలుషితమైన ఆహారం, నీటి వల్ల ఇది శరీరంలోకి వెళ్తుంది. వ్యాధి సోకిన వ్యక్తిని తాకడం, వాళ్లు వాడిన వస్తువులను వాడటం వల్ల కూడా ఇది ఇతరులకు సోకుతుంది. ఈ వ్యాధి ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా 5 ఏళ్ల లోపు పిల్లలపై ఎక్కుగా ప్రభావం ఉంటుంది. అలాగే ఇమ్యూనిటి తక్కువగా ఉన్నవాళ్లలో ఇది ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉంది. 

Also Read: ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్.. అణు పరిశోధన కేంద్రంపై దాడులు

షిగెల్లా వ్యాప్తిని అరికట్టేందుకు పరిశుభ్రతే మార్గమని వైద్యులు చెబుతున్నారు. ఆహారం తినే ముందు చేతులను సబ్బుతో శభ్రంగా కడుక్కోవాలని.. నీటిని బాగా మరిగించి చల్లార్చుకుని తాగాలని సూచిస్తు్న్నారు. కలుషితమైన ఆహారాన్ని తీసుకోకూడదని చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు