USA: అమెరికా యూటర్న్.. ట్రంప్ తోక ముడిచేందుకు కారణం ఇదేనా?

తమ దారికి రాకుంటే ఇరాన్ ను అంతు చూస్తామంటూ ప్రకటించిన ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించకుంటే ఇరాన్ లో ఏ ఒక్క విద్యుత్ కేంద్రాన్ని కూడా ఉండనివ్వనంటూ సవాల్ విసిరి.. 24 గంటల్లోనే తోక ముడిచారు.

New Update
Reasons behind trump 5 days pause on iran strikes

Reasons behind trump 5 days pause on iran strikes

తమ దారికి రాకుంటే ఇరాన్ ను అంతు చూస్తామంటూ ప్రకటించిన ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించకుంటే ఇరాన్ లో ఏ ఒక్క విద్యుత్ కేంద్రాన్ని కూడా ఉండనివ్వనంటూ సవాల్ విసిరి.. 24 గంటల్లోనే తోక ముడిచారు. ఇరాన్‌పై 5 రోజుల పాటు ఎలాంటి దాడులు చేయమన్నారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. రెండు రోజులుగా ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై జరపాల్సిన సైనిక దాడులు 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నామన్నారు. జరుగుతున్న చర్చల విజయంపై భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.  

 అమెరికా తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తామన్న వార్నింగ్ కు ట్రంప్ భయపడ్డారని ఇరాన్ ప్రకటన విడుదల చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌ ను చిత్తుగా ఓడించామని తెలిపింది. ట్రంప్ చెబుతున్నట్లుగా అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. తమపై మళ్లీ దాడులు చేసేందుకే ట్రంప్ ప్లాన్ చేస్తున్నారని ఫైర్ అయ్యింది. 

Also Read: ఆలయంలో అమానుష ఘటన.. భక్తులను ఈడ్చుకెళ్లి కొట్టిన పూజారులు

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు దిగాయి. అదే రోజు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని చంపేశాయి. ఆ తర్వాత కొనసాగిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ చీఫ్‌ అలీ లారిజానీ, ఇరాన్ నిఘా సంస్థ మంత్రి ఎస్మాయిల్ ఖతీబ్ తో పాటు కనీసం 48 మంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 8,000 మందికి పైగా ఇరాన్ సైనికులు మరణించారు. సుమారు 20,000 మంది సైనికులు గాయపడ్డారు. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మానవ హక్కుల సంస్థల లెక్కల ప్రకారం, కనీసం 1,400 నుండి 3,000 మంది పౌరులు మరణించారు. ముఖ్యంగా మినాబ్ (Minab) నగరంలోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 160 మందికి పైగా విద్యార్థులు మరణించారు. 

అమెరికా, ఇజ్రాయల్ భీకర దాడులకు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక కేంద్రాలు, రక్షణ పరిశోధన సంస్థలపై జరిగిన దాడుల వల్ల ఆ దేశ రక్షణ సామర్థ్యం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లింది. తమ సుప్రీం లీడర్ ను కోల్పోయినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఏకంగా అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ విమానమైన F-35ను కూల్చి వేసి.. అగ్రరాజ్యాన్ని ఆత్మరక్షణలో పడేసింది. రాడార్ కు కూడా చిక్కని ఈ విమానాన్ని ధ్వంసం చేసి తన టెక్నాలజీ పవర్ ఏంటో చూపెట్టింది.

Also Read: 23వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌కు భారీ నష్టం..

ఇరాన్ దాడుల్లో దాదాపు 15 మంది అమెరికన్ సైనికులు మరణించారు. వీరిలో 7 మంది ప్రత్యక్ష యుద్ధంలో మరణించగా, మిగిలిన వారు విమాన ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల వల్ల సుమారు 200 మంది సైనికులు గాయపడ్డారు. వీరిలో అత్యధికులు కువైట్, సౌదీ అరేబియాలోని బేస్‌లపై జరిగిన దాడుల్లో గాయపడిన వారే. యుద్ధం ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే అమెరికా సుమారు రూ.32,000 కోట్ల విలువైన సైనిక పరికరాలను కోల్పోయినట్లు అంచనా. అత్యంత ఖరీదైన THAAD యాంటీ-బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్‌కు చెందిన రాడార్ యూనిట్లు సౌదీ అరేబియా, యూఏఈలలో ధ్వంసమయ్యాయి. 

ఒక్కో రాడార్ విలువ సుమారు 500 మిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఖతార్ లోని రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం పై మిస్సైళ్లతో దాడి చేసి నాశనం చేసింది. ఇంకా దుబాయ్ లోని బూర్జు ఖలీఫాను కూడా టార్గెట్ చేసి దుబాయ్ ను భయపెట్టింది. ఈ అటాక్స్ తో ట్రంప్ పై ఒత్తిడి తెచ్చింది. రెండు రోజుల్లోనే యుద్ధాన్ని క్లోజ్ చేద్దామన్న అమెరికాకు ఇప్పటి వరకు రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టించింది ఇరాన్. 

ట్రంప్ యూటర్న్‌కు కారణాలు

1.ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20% నుండి 25% వరకు హార్మూజ్ జలసంధి గుండానే వెళ్తుంది. ఇరాన్ హెచ్చరికలతో ఇక్కడ వేల కొద్ది నౌకలు ఆగిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత పెరగడంతో పాటు పలు దేశాల్లో ధరలో భగ్గుమన్నాయి. దీంతో అమెరికాపై తీవ్ర ఒత్తిడి, వ్యతిరేకత పెరిగింది. దీన్ని సాధారణ స్థితికి తేవడానికే ట్రంప్ వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.

2. ఒక దేశంపై నిరంతరం దాడులు చేయడం వల్ల అంతర్జాతీయంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తాము శాంతికి అవకాశం ఇచ్చాం, కానీ వారే ఉపయోగించుకోలేదని చెప్పుకోవడానికి కూడా ఈ 5 రోజుల విరామం ఉపయోగపడుతుందన్నది ట్రంప్ ఆలోచన అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

3. పెంటగాన్ లో ఆయుధాల కొరత ఏర్పడిందన్న వార్తలు ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుధాలను తిరిగి సమకూర్చుకోవడం, తదుపరి లక్ష్యాలను ఎంచుకోవడానికి ఈ సమయాన్ని అమెరికా ఆర్మీ ఉపయోగించుకుంటుందన్న చర్చ కూడా సాగుతోంది. 

4. ఇరాన్ అంతర్గత ఒత్తిడి: ఈ విరామం వల్ల ఇరాన్ నాయకత్వంపై అంతర్గతంగా ఒత్తిడి పెరుగుతుందని ట్రంప్ భావిస్తున్నట్లు కూడా పలు నివేదికలు చెబుతున్నాయి. లొంగిపోవాలా లేక పోరాడాలా అనే సందిగ్ధంలో ఇరాన్‌ను ఉంచడం కూడా ట్రంప్ ఎత్తుగడలో భాగమేనని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి.

Advertisment
తాజా కథనాలు