/rtv/media/media_files/2026/03/23/4-killed-as-cold-storage-facility-collapses-in-uttar-pradesh-2026-03-23-20-24-20.jpg)
4 killed as cold storage facility collapses in Uttar pradesh
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కోల్ట్ స్టోరేజ్ బిల్డింగ్‌లో కొంత భాగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద కొందరు కార్మికులు చిక్కుకుపోగా.. పోలీసులు, అగ్నిమాపక దళం, NDRF, SDRF టీమ్‌లు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అలాగే ఆ బిల్డింగ్ నుంచి బయటికొచ్చిన అమ్మోనియా గ్యాస్ లీకేజీని కూడా అరికట్టాయి.
Also Read: ఆలయంలో అమానుష ఘటన.. భక్తులను ఈడ్చుకెళ్లి కొట్టిన పూజారులు
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అన్సార్ అహ్మద్‌కు చెందిన కోల్డ్ స్టోరేజ్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడ్డవాళ్లకు రూ.50 వేల చొప్పున ఇస్తామన్నారు.
A country not at war. Not a missile attack. Just a cold storage collapse.
— زماں (@Delhiite_) March 23, 2026
📍Allahabad, UP
Workers buried under rubble as a cold storage structure collapses. No bombs, no war, no enemy... just crumbling infrastructure and zero accountability. pic.twitter.com/2TG893GVg3
Also Read: 23వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌కు భారీ నష్టం..
Follow Us