తమిళనాడులో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాడవంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ సీఎం స్టాలిన్‌పై విమర్శలు చేస్తూ నోరు జారారు. నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా '' అంటూ ప్రశ్నించారు. హీరోయిన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సీఎం స్టాలిన్ ఓ స్కీమ్‌ను తీసుకొచ్చారు. మీ కలలు చెప్పండి.. మేము నెరవేరుస్తాం అనే పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్‌పై అన్నాడీఎంకే నేతలు సెటైర్లు వేస్తున్నారు. విల్లుపురంలో అన్నాడీఎంకే ఎంపీ, మాజీ మంత్రి షణ్ముగన్ ఈ స్కీమ్‌పై వ్యగ్యంగా విమర్శించారు. ''నాకు నయనతార కావాలి. నా కోరిక నెరవేరుస్తారా, నయనతారను పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ల కలను సీఎం నిజం చేస్తారా'' అంటూ ప్రశ్నించారు.
Also Read: TMC అభ్యర్థుల జాబితా విడుదల.. మళ్లీ దీదీ VS సువేందు అధికారి
షణ్మగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. డీఎంకే నేతలు, సినీఇండస్ట్రీలో ఉన్నవాళ్లు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా ఈ అంశంపై స్పందించారు. మా పార్టీ విధానాలను విమర్శించండి.. కానీ మహిళలలపై అసభ్యకరంగా మాట్లాడకండి అంటూ విమర్శించారు. నయనతారను అవమానించి మొత్తం మహిళలను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడిన ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
గతంలో కూడా షణ్ముగన్ మహిళలపై నోరు జారారు. గతేడాది సీఎంను విమర్శిస్తూ ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత పెళ్లాం అనే స్కీమ్‌ను కూడా ప్రవేశపెడతారంటూ విమర్శలు చేశారు. ఇదిలాఉండగా తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read: ముగ్గురు MLAలను బహిష్కరించిన కాంగ్రెస్!
Tamilnadu: 'నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా'.. ఎంపీ వింత కోరిక
అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ సీఎం స్టాలిన్‌పై విమర్శలు చేస్తూ నోరు జారారు. నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా '' అంటూ ప్రశ్నించారు. హీరోయిన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
AIDMK MP Shanmugam Makes Derogatary Comments On Nayanatara