/rtv/media/media_files/2026/03/17/fresh-snowfall-affects-normal-life-in-kashmir-2026-03-17-21-32-00.jpg)
Fresh snowfall affects normal life in Kashmir
కశ్మీర్ మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గత రెండ్రోజులుగా మంచు తుఫానుతో పాటు వర్షం కూడా కురుస్తోంది. దీంతో జమ్మూ కశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జన జీవనం స్తంభించిపోయింది. మార్చి 20 దాకా ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని IMD ప్రకటన చేసింది. ఇప్పటికే అక్కడ మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అనేక చోట్ల 12 అంగుళాల వరకు మంచు తుఫాను కురుస్తోంది.
Kalghatgi Taluk, Dharwad district turns into wonderland after Hailstorm today
— Karnataka Portfolio (@karnatakaportf) March 17, 2026
What began as heavy rainfall quickly escalated into a severe hailstorm, covering roads, streets, and open areas with thick layers of ice. The sudden weather change disrupted normal life, making travel… pic.twitter.com/7GP8lCmvwT
Also Read: స్కూల్‌లో టవల్‌తో అమ్మాయిల డ్యాన్స్.. స్పందించిన మానవ హక్కుల కమిషన్
జోజిలా పాస్ అనే ప్రాంతంలో 5 అంగుళాలు, సోమానార్గ్‌లో 34 అంగుళాల మంచు కురుస్తోంది. ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. రోడ్లపై అంతా మంచు పేరుకుపోవడంతో అధికారులు వీటిని మూసివేశారు. మరోవైపు పొగమంచు వల్ల చాలా దూరం దాకా వాహనాలు కనిపించడం లేదు. అనంతనాగ్ జిల్లాలో జాతీయ రహదారి 244పై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రంతా వాహనాలు రోడ్లపై ఉన్నాయి. అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
#WATCH | J&K: Heavy snowfall in the upper reaches of Bhalesa over the last three hours has caused a sharp dip in temperature despite mid-March. While higher areas received fresh snow, the plains experienced rainfall. As a precaution, schools across district Doda have been closed,… pic.twitter.com/2r6uz8wtTU
— ANI (@ANI) March 16, 2026
Also Read: 'నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా'.. ఎంపీ వింత కోరిక
ఈ ప్రాంతం నుంచి 400 మంది పర్యాటకులను, సాధారణ ప్రజలను అధికారులు రక్షించారు. అక్కడ ఆర్మీకి చెందిన 19 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. ప్రజలకు సాయం చేసేందుకు వాతావరణం అనుకూలించడం లేదు. అయినప్పటికీ ప్రత్యేక సామగ్రి, తాళ్లతో సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై చిక్కుకుపోయిన వాహనాలను తరలిస్తున్నాయి. పర్యాటకులను, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంచు తుఫాను కురుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Follow Us