/rtv/media/media_files/2026/03/17/mamata-vs-suvendu-again-trinamool-to-contest-291-seats-in-west-bengal-polls-2026-03-17-17-25-49.jpg)
Mamata vs Suvendu again Trinamool to contest 291 seats in West Bengal polls
వచ్చే నెలలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లో సోమవారం బీజేపీ 144 మంది అభ్యర్థులు జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం టీఎంసీ పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసింది. 294 స్థానాలకు 291 స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు బరిలోగి దిగనున్నారు. డార్జిలింగ్‌లోని మూడు ప్రాంతాల్లో అనిత్ థాపా నేతృత్వంలోని బీజీపీఎం పోటీ చేయనుంది.
Also Read: మహారాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం..మత మార్పిడికి పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్ష!
మరోవైపు టీఎంసీ కంచుకోట అయిన భవానీపుర్ నియోజకవర్గం నుంచి సీఎం మమతా బెనర్జీ బరిలోకి దిగనున్నారు. అదే స్థానం నుంచి బీజేపీ తరఫున విపక్ష నేత సువేందు అధికారి పోటీ చేయనున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి నెలకొంది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఓటర్లను ఆకర్షించేందుకు కీలక హామీలిస్తున్నారు. ఈసారి కూడా అధికారం నిలబెట్టుకోవాలని టీఎంసీ గట్టి పట్టుదలతో ఉండగా బీజేపీ కూడా ఎలాగైన ఈసారి అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: ముగ్గురు MLAలను బహిష్కరించిన కాంగ్రెస్!
ఇదిలాఉండగా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అయిదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. కేరళ, అస్సా, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం)లో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Follow Us