Watch Video: ఆలయంలో అమానుష ఘటన.. భక్తులను ఈడ్చుకెళ్లి కొట్టిన పూజారులు

మహారాష్ట్రలోని కొహ్లాపూర్‌లో ఉన్న జ్యోతిబా ఆలయంలో సోమవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 20 మంది పూజారులు ఇద్దరు భక్తులపై తీవ్రంగా దాడి చేశారు.   దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Priests drag, beat devotees during rituals in Jyotiba Temple

Priests drag, beat devotees during rituals in Jyotiba Temple

మహారాష్ట్రలోని కొహ్లాపూర్‌లో ఉన్న జ్యోతిబా ఆలయంలో సోమవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 20 మంది పూజారులు ఇద్దరు భక్తులపై తీవ్రంగా దాడి చేశారు.   దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ భక్తులపై పిడిగుద్దులు గుద్దడం, కాళ్లతో తన్నడం లాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఆలయానికి సంబంధించి 'శాసనాథి ప్రదక్షిణ', 'హారతి' పూజా కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

Also Read: కూతురు కులాంతర వివాహం.. మాజీ ఎమ్మెల్యేకు కుల బహిష్కరణ!

అయితే ఆ భక్తులు హరతి పూజా కార్యక్రమం జరుగుతున్న సమయంలో పూజరులపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. పూజారులు హెచ్చరించినప్పటికీ వారి పనికి ఆటంకం కలిగించారని అందుకే వారిపై దాడి జరిగినట్లు పేర్కొన్నారు. సమాచారం మేరకు అక్కడున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పూజారులను అక్కడినుంచి చెదరగొట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. భక్తులపై పూజరులు అలా మూకుమ్మడిగా దాడులు చేయడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పూజా సమయంలో ఆటంకం కలిగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు