అమెరికాకు బిగ్ షాక్.. విదేశాల నుంచి దిగుమతులు.. స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు

గల్ఫ్ దేశాల్లో వాణిజ్య చెల్లింపులకు సంబంధించి భారత్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆయా దేశాల స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు చేసే మార్గాలు అన్వేషిస్తోంది.

New Update
India looks to settle trade with Gulf countries in local currencies amid global uncertainties

India looks to settle trade with Gulf countries in local currencies amid global uncertainties


గల్ఫ్ దేశాల్లో వాణిజ్య చెల్లింపులకు సంబంధించి భారత్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆయా దేశాల స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు చేసే మార్గాలు అన్వేషిస్తోంది. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో చమురు సహా ఇతర వస్తువుల దిగుమతుల బిల్లు పెరగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడారు.  

Also Read: ప్రభుత్వం సంచన నిర్ణయం.. డీజే పాటలు, ఐటం సాంగ్స్‌పై నిషేధం !

చమురు, పెట్రోలియం ఉత్పత్తులుతో పాటు ఇతర వస్తువుల దిగుమతుల బిల్లు పెరుగుతోందని తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితులు తలెత్తినా కూడా ఆ ప్రభావం నుంచి దిగుమతుల బిల్లును కాపాడుకోవాలని భారత్ యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 110 డాలర్లకు పెరిగింది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో ఇటీవల ధరలు పెరగడం వల్ల భారత్‌కు దిగుమతి బిల్లు భారీగా పెరగనుంది. 

Also Read: 8 మందిని బలితీసుకున్న EV ఛార్జింగ్ పాయింట్

అయితే ఈ ఎఫెక్ట్‌ వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం మీద కనిపించనుంది. అలాగే 2024-25లో కూడా భారత్‌ చమురు దిగుమతుల్లో గల్ఫ్ దేశాల నుంచే 28 శాతం ఉంది. దీంతో స్థానిక కరెన్సీల్లో వాణిజ్య చెప్పింపులు చేస్తే దిగుమతి బిల్లులపై భారం తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు