HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్
ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ లో జనాలు రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ లో జనాలు రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను చెల్లించేలా ఓటీఎస్‌ను అమలు చేస్తుంది. ఓటీఎస్ పథకం ద్వారా 90 శాతం వడ్డీ మాఫీతో చెల్లించవచ్చు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మొత్తం పన్నుతో పాటు వడ్డీ 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ తాజా కిచెన్, టోలిచౌకిలోని అమోఘ్ హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిల్వ ఉంచిన పదార్థాల దగ్గర బొద్దింకలు, ఎలుకలు, పాడైన కూరగాయలను అధికారులు గుర్తించారు. ఇలాంటి ఫుడ్స్ తింటే అనారోగ్య సమస్యల బారిన పడతారు.
MLC ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్‌లో ఓటమికి కారణం పార్టీలో సమన్వయలేకపోవడమని నిర్ణారించారు. సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని మంత్రులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కేబీహెచ్‌బీలో ముగ్గురు అమ్మాయిలు ఫుల్‌గా తాగి నానా హంగామా చేశారు. కారు నడుపుతూ రోడ్డుపై బైక్‌లకు ఢీకొట్టి కొట్టారు. ఇదేంటని అడిగిన యువకుడిపై బూతులతో రెచ్చిపోయారు. ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 212 రీడింగ్ వచ్చింది.
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మార్చి 8 శనివారం రోజున నీటి సరఫరా ఉండదని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. బీహెచ్ఈఎల్ జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా నీటి సరఫరాకి అంతరాయం కలగించనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నీటి సరఫరా ఉండదని తెలిపారు.
హైదరాబాద్‌లో తాగునీటితో బైక్ కడిగినందుకు ఓ వ్యక్తికి జలమండలి రూ.1000 జరిమానా విధించింది. ఈ క్రమంలో తాగునీటిని వృథా చేయవద్దని తెలిపింది. తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు నీటిని ఇలా వృథా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది.
మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను అతని భార్య రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంది. అయితే స్పాట్ లో ఆమెకు భర్త ప్రియురాలు దొరకడంతో చితకబాదింది. అయితే ఆమె భర్త ముందే విషయం తెలుసుకుని చెప్పులు చేతిలో పట్టుకుని సైలెంట్ గా గోడ దూకి పరారయ్యాడు.