/rtv/media/media_files/2025/01/31/PDlkXe8tkvC9zLNX72Wy.jpg)
Old City Metro Rail
బెట్టింగ్ యాప్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచీ సినిమావాళ్ళ వరకూ ఈ యాప్స్ ప్రమోషన్లు ఇచ్చారు. దీనిని పోలీసులు సీరియస్ గా తీసుకోవడంతో వరుస పెట్టి చిన్న పెద్దా అందరిపైనా కేసులు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేసి అమాయక జనం మోసపోయి బలవన్మరణాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ పైన, టీవీ నటులు, యాంకర్ లతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులపై సైతం పోలీస్ శాఖ కేసులు నమోదు చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11మందిపైన, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 25మందిపైన కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలా మందికి ఇవాళ నోటీసులు కూడా వెళ్ళాయి.
మెట్రో ట్రైన్స్ పైనా..
దీని తర్వాత ఈ బెట్టింగ్ యాప్ ల విషయంలో మఐదరాబాద్ మెట్రో ట్రైన్స్ సైతం చిక్కుకున్నాయి. మెట్రో రైళ్లపైన, లోపల, స్టేషన్ లలో, ట్రాక్ ఫిల్లర్లపైన యాడ్స్ కనిపిస్తుంటాయి. దీని ద్వారా మెట్రో యాజమాన్యానికి బోలెడంత డబ్బులు వస్తాయి. నిజానికి దీని వలన ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. కానీ ఇక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ యాడ్ వస్తుండడమే వివాదంగా మారింది. దీంతో సినిమా, యూట్యూబర్ల మీద చర్యలు తీసుకుంటున్న పోలీసులు మెట్రో ట్రైన్స్ మీద వస్తున్న యాడ్స్ ను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ పలువురు ప్రయాణికులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం కాస్తా మెట్రో యాజమాన్యం దగ్గరకు వెళ్ళింది. దాంతో మెట్రో ట్రైన్స్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దీనిపై స్పందించారు. మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం తన దృష్టికి వచ్చిందని...వాటిని వెంటనే తొలగించమని ఎల్ అండ్ టీ, అడ్వర్టైజ్ కంపెనీలకు ఆదేశించామని తెలిపారు. ఈరోజు రాత్రి లూపే మొత్తం ప్రక్రియ అంతా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.