Hydra: హైడ్రా స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే కటకటాలపాలే!

హైడ్రా కీలక ప్రకటన విడుదల చేసింది. హైడ్రా పేరుతో ఎవరైనా లావాదేవీలు, అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలుంటాయ‌ని హైడ్రా కమీషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ప్రత్యక్షంగా లేదా ప‌రోక్షంగా హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడ్డవారిపై కేసులు పెట్టినట్లు తెలిపారు. 

New Update
Ranganath - Hydra

Hydra Commissioner Ranganath issued importent announcement

Hydra: హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా పేరుతో ఎవరైనా లావాదేవీల‌కు, అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలుంటాయ‌ని హెచ్చరించింది. ఈ మేర‌కు అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు ఆధారాలుంటే వెంట‌నే త‌న దృష్టికి తీసుకు రావాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్(Commissioner AV Ranganath)  కోరారు. లేని ప‌క్షంలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగానికి, స్థానిక పోలీసు స్టేష‌న్లో ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. అవ‌క‌త‌వ‌క‌లు నిజ‌మైన ప‌క్షంలో హైడ్రా ఉద్యోగులైతే స‌స్పెండ్ చేయ‌డంతో పాటు.. క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా లేదా ప‌రోక్షంగా హైడ్రా పేరును వినియోగించుకుని వ‌సూళ్లకు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలుంటాయ‌న్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప‌లువురిపై కేసులు కూడా పెట్టామ‌న్నారు. నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తున్నట్టు ఏవైనా ఫిర్యాదులుంటే జ‌డ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి త‌మ దృష్టికి కాని, ఏసీబీ, విజిలెన్స్, పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు. అలాగే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చని చెప్పారు. 

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

వంశీరాం బిల్డర్లపై ఎమ్మెల్యే ఫిర్యాదు అంద‌లేదు..

గ‌త సంవ‌త్సరం 18.8.24న, 21.12.24 తేదీల్లో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నుంచి హైడ్రాకు రెండు ఫిర్యాదులు అందాయి. ఖాజాగూడ‌లోని తౌతానికుంటలో నీరు నిలిచిపోవ‌డం వ‌ల్ల గ్రీన్‌గ్రేస్ అపార్టు మెంట్ సెల్లార్‌లోకి నీరు చేరుతోంద‌నేది ఒక‌టి. తౌతానికుంట నిండిన త‌ర్వాత వ‌ర‌ద నీరు భ‌గీర‌థ‌మ్మ చెరువుకు వెళ్లడంలేద‌నేది రెండో ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఈ రెండు ఫిర్యాదుల‌పైన కూడా  నేరుగా తానే రెండు సార్లు క్షేత్ర స్థాయిలో ప‌ర్యటించి స‌మ‌స్యల‌ను తెలుసుకున్నానని క‌మిష‌న‌ర్ గుర్తుచేశారు. పైనుంచి వ‌చ్చిన వ‌ర‌ద‌ను తౌతానికుంట‌కు త‌ర్వాత భ‌గీర‌థ‌మ్మ చెరువులోకి వెళ్లే అవ‌కాశాల‌ను ప‌రిశీలించారు. భ‌గీర‌థ‌మ్మ చెరువులో ఆక్రమ‌ణ‌లు గ‌త ఏడాది డిసెంబ‌రు చివ‌రి వారంలో హైడ్రా తొల‌గించింది. వంశీరాం మ్యాన్‌హ‌ట్టన్ ప్రాజెక్టుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదు అంద‌లేదు. ఈ విష‌యంలో వారి వ‌ద్ద ఏమైనా ఫిర్యాదు ఉంటే వాట్సప్‌లో అయినా పంపితే ప‌రిశీలిస్తాం. గ‌తంలో ఎమ్మెల్యే వాట్సాప్‌లో స‌మ‌స్యను చెబితే స్పందించాం. ప్రజాప్రతినిధుల ఫిర్యాదుల‌కు ప్రాధ‌న్యత ఉంటుంద‌ని తెలిపారు. 

ఫిర్యాదు ఎవ‌రిదైనా త‌క్షణ స్పంద‌న..

ఫోన్‌ చేసి తమ స‌మ‌స్యలను తెలుపవచ్చన్నారు. ఒక వేళ స‌మావేశాల్లో ఉన్నప్పుడు ఫోను లిఫ్ట్ చేయ‌లేక‌పోయినా ఫిర్యాదుదారులు మెసేజ్ పెడితే స్పందించ‌డం స‌ర్వసాధ‌ర‌ణంగా జ‌రుగుతుంద‌ని రంగ‌నాథ్‌గారు తెలిపారు. ప్రతి సోమ‌వారం నిర్వహించే ప్రజావాణిలోనే కాకుండా.. ప‌ని దినాల్లో మ‌ధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంట‌ల వ‌ర‌కూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీక‌రిస్తున్నట్టు క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుల‌కే స్పంద‌న క‌రువా అని అనిరుధ్‌రెడ్డి ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు వ‌చ్చిన వార్తల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఈ వివ‌ర‌ణ ఇచ్చారు.

Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

ఫిర్యాదుల‌పై వెంట‌నే చ‌ర్య..

ప్రజ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌పై హైడ్రా వెంట‌నే స్పందిస్తుంది. నేరుగా క్షేత్రస్థాయిలో ప‌రిశీలించి చ‌ర్యలు తీసుకుంటోంది. ఫిర్యాదుల‌పై హైడ్రా వెంట‌నే స్పందిస్తుంద‌ని ప్రజ‌లు గ్రహించారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తే ద‌శాబ్దాల‌ స‌మ‌స్యలకు కూడా వెంట‌నే ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ప్రజ‌లు న‌మ్ముతున్నారు. ఇలా హైడ్రాకు 9800ల ఫిర్యాదులందాయి. వీటిలో చాలా వ‌ర‌కు ప‌రిష్కారమ‌య్యాయి. ప్రతి ఫిర్యాదును పార‌ద‌ర్శకంగా, సాంకేతికంగా, క్షుణ్నంగా ప‌రిశీలించి చ‌ర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని స‌మ‌స్యలు ప‌రిష్కారానికి స‌మ‌యం తీసుకోడానికి ఇవే కార‌ణాలని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌గారు చెప్పారు.


Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి

ఫిర్యాదుల‌పై స‌మీక్ష..

ప్రతి సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి వ‌ర‌కూ నిర్వహించే ప్రజావాణిలో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స్వయంగా ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తారు. ఫిర్యాదు దారుల ముందే గూగుల్ మ్యాప్స్‌, శాటిలైట్ ఇమేజెస్‌, స‌ర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల ఆధారంగా.. అప్పటిక‌ప్పుడే స‌మ‌స్యపై చ‌ర్చించి.. సంబంధిత అధికారుల‌కు వాటి ప‌రిష్కార బాధ్యత‌ల‌ను అప్పగిస్తారు. అక్కడితో ఆగ‌కుండా ఫిర్యాదుల ప‌రిష్కారం ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింద‌నేది వారంలో రెండు రోజులు క‌మిష‌న‌ర్ స‌మీక్షిస్తారు. కొన్ని పిర్యాదుల‌పై నేరుగా క్షేత్రస్థాయిలో ప‌ర్యటించి, ప‌రిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. 

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Husband attacks wife : కొండాపూర్ లో దారుణం.. గ‌ర్భిణి అయిన భార్యను చంపాలని...

కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది..గ‌ర్భిణిని చంపేందుకు భ‌ర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. 

New Update
Husband attacks wife

Husband attacks wife

Husband attacks wife : కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది.. గ‌ర్భిణిని చంపేందుకు భ‌ర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైన మహిళ చావుబ‌తుకుల మధ్య ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. 

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!
 
 గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త ఏం జరిగిందో ఏమో గానీ, ఒకసారిగా భార్యమీద దాడి చేశాడు.బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద దాడి చేసిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

పోలీసుల కథనం ప్రకారం… వికారాబాద్‌కు చెందిన ఎండి బస్రత్ (32) బ‌తుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఇంటీరియర్ పనులు చేసుకుంటూ కుటుంబంతో కలిసి హఫీజ్ పేట్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా 2023 జనవరిలో అజ్మీర్ దర్గాకు వెళ్లే క్రమంలో ప్రయాణంలో బస్రత్‌కు కోల్‌క‌తాకు చెందిన షబానా పర్వీన్(22) పరిచయం అయ్యింది. వీరి పరిచయం ప్రేమగా మారగా, 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.వివాహం అనంతరం ఇద్దరు హఫీజ్ పేట్ ఆదిత్యనగర్‌లో కాపురం పెట్టగా, బస్రత్ ఇంటీరియర్ డిజైన్ పనులు చేస్తున్నాడు. పెళ్లి అనంతరం మొదట అత్తామామలతో కలిసి ఉండగా, కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి.

 Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 దీంతో బస్రత్, షబానా పర్వీన్‌లు స్థానికంగా వేరు కాపురం పెట్టారు. ప్రస్తుతం షబానా పర్వీన్ రెండు నెలల గర్భిణి కాగా, మార్చి 29న పర్వీన్‌కు వాంతులు కావడంతో కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని సియా లైఫ్ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తరువాత పర్వీన్‌ను ఏప్రిల్ 1వ తేదీన రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి బయటకు రావడంతోనే, హాస్పిటల్ ముందే భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఇద్దరి మద్య మాటామాటా పెరగడంతో బస్రత్ ఒక్కసారిగా తన భార్య పర్వీన్ మీద దాడికి తెగబడ్డాడు. నడిరోడ్డు మీద పెనుగులాటలో కిందపడిన భార్య మీద అక్కడే ఉన్న బండరాయితో దాడి చేశాడు. దాదాపు 10 నుంచి 12సార్లు రాయితో మోదడంతో పర్వీన్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లింది. చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

ఈ ఘ‌ట‌న‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పర్వీన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా పర్వీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న పర్వీస్ ప్రాణాలతో పోరాడుతుంది. పర్వీన్ కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు నిందితుడు బస్రత్‌ను ఈనెల 3న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు