/rtv/media/media_files/2025/03/20/uzWNuvTzorb5nTjnxxap.jpg)
shiva jyothi Photograph: (shiva jyothi)
Betting app: బెట్టింగ్ యాప్ కేసులో మరిన్ని సంచలనాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు చేయగా మరికొంతమంది సెలబ్రిటీల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేసి, బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా జనాలను అలరించిన శివజ్యోతి సైతం బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 'ఇప్పటికీ కూడా జనాలు మనదగ్గరకు వచ్చి బాగా హార్డ్ వర్క్ చేస్తే పైసలు సంపాదించొచ్చు అని చెబుతున్నారా? అయితే అసలు పట్టించుకోకండి. ఇప్పడు మీ డ్రీమ్ రన్ ను 1XBET తో ప్రారంభించండి' అంటూ ఆమె చెప్పిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
Siva Jyothi Ela miss ayindi
— AlwaysCharanist (@avndec31) March 20, 2025
No1 fraud idi
V6 news chadive position nundi ippudu crores earn chesindi ee bettings apps tho pic.twitter.com/cANsJvdvoc
నెం 1 ఫ్రాడ్ ఇది..
'శివ జ్యోతి ఎలా మిస్ అయింది? నెం 1 ఫ్రాడ్ ఇది. న్యూస్ చదివే స్థాయి నుంచి ఇప్పుడు కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగింది ఈ బెట్టింగ్ యాప్ వల్లనే. వెంటనే అరెస్ట్ చేయండి. సజ్జనార్ సర్ ఈమెని కాపాడుతున్నది ఎవరు? పల్లెటూరి యువతని బెట్టింగ్ వైపు ఆకర్షించి ఎందరో అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈమెపై ఇంకా కేసు ఎందుకు నమోదు అవ్వడం లేదు?' అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. దీంతో శివజ్యోతిపై కూడా కేసు నమోదు చేసేందుకు రంగనాథ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈమెని కాపాడుతున్నది ఎవరు సర్ ?@SajjanarVC
— Telangana Buzz (@BuzzTelangana) March 20, 2025
పల్లెటూరి యువతని బెట్టింగ్ వైపు ఆకర్షించి ఎందరో అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈమెపై ఇంకా కేసు ఎందుకు నమోదు అవ్వడం లేదు ?? pic.twitter.com/1cHJdr5W5L
బలమైన ప్రూఫ్స్..
ఇదిలా ఉంటే.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన సెలబ్రెటీలకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూయిస్తున్నారు. ఇటీవల యాంకర్ విష్ణుప్రియతో పాటు మొత్తం 11 మంది సెలబ్రెటీలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ ఈ రోజు తన లాయర్ తో కలిసి పంజాగుట్ట పీఎస్ కు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్‌తో కలిసి ఆమె విచారణకు హాజరయ్యారు. ముఖం కనిపించకుండా తలకు స్కార్ఫ్ తో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియ మొబైల్ ను పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో ఆమె ఏం మాట్లాడారు. వారి మధ్య ఎలాంటి సంప్రదింపులు, లావాదేవీలు జరిగాయి అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. బలమైన ప్రూఫ్స్ ఉండడంతోనే విష్ణు ప్రియ ఫోన్ ను సీజ్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఏ క్షణమైనా ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది.
(betting-app | hyderabad | telugu-news | rtv telugu news | latest-telugu-news | today telugu news)