ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: పరిటాల శ్రీరామ్ సీటుపై ఉత్కంఠ..! రెండో సీటు ఇస్తారా? అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్ సీటుపై సస్పెన్స్ నెలకొంది. రాప్తాడు నుంచి పరిటాల సునీతకు సీటు ఇచ్చారు. అయితే, పరిటాల ఫ్యామిలీకి రెండో సీటు ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠగా కొనసాగుతుంది. పరిటాల శ్రీరామ్ ధర్మవరం సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: టీడీపీ సీనియర్లకు బిగ్ షాక్.. వీళ్లకు నో టికెట్..! టీడీపీలో పలువురు సీనియర్లకు బిగ్ షాక్ తగిలింది. తొలి జాబితాలో సీనియర్లు దేవినేని ఉమ, గంటా, చింతమనేని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోడె ప్రసాద్, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మండలి బుద్ధప్రసాద్, బీకె పార్ధసారధికి టిక్కెట్ దక్కలేదు. By Jyoshna Sappogula 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ..ఈ సారి కూడా అక్కడి నుండే పోటీ చేస్తారా? టీడీపీ, జనసేన పొత్తులో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో కేవలం 5 చోట్ల అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. మిగిలిన 19 సీట్లలో పవన్ ఎక్కడి నుంచి బరిలో దిగుతారోనని ఆసక్తి కనిపిస్తోంది. By Jyoshna Sappogula 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఉత్కంఠ.. ఆశావాహుల్లో మొదలైన టెన్షన్! ఏపీలో టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా ఈ రోజు ఉదయం 11.40కు విడుదల కానుంది. 60-70 అసెంబ్లీ స్థానాలపై ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ముందుగా రెండు పార్టీల మధ్య వివాదాలు లేని స్థానాలపై ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తుండగా ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. By srinivas 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: విజయనగరం జిల్లాలో దారుణం.. తల్లిదండ్రులనే కడతేర్చిన కసాయి కొడుకు..! విజయనగరం జిల్లా బొండపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకే తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. కుటుంబ మనస్పర్థలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. By Jyoshna Sappogula 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-JSP: అక్రమ ఇసుక దోపిడిపై రేపు టీడీపీ, జనసేన ఆందోళనలు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక దోపిడిపై రేపు టీడీపీ, జనసేన ఆందోళనలు చేయనున్నాయి. టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుకను రద్దు చేసి ఇసుక మాఫియాతో జగన్ రెడ్డి 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్లు లూఠీ చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. By Jyoshna Sappogula 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhuvaneshwari: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై భువనేశ్వరి దిగ్భ్రాంతి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైసీపీ కార్యకర్తల దాడిలో కంటి చూపు కోల్పోయిన హంసవేణిని నారా భువనేశ్వరి పరామర్శించారు. గ్రామంలో ఉన్న సమస్య చెప్పిందని దాడి చేసి కళ్లు పోగొడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగుడైన బాధిత మహిళ కుమారుడి బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. By Jyoshna Sappogula 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : మాజీ సీఎస్ జన్నత్ హుస్సేన్ కన్నుమూత ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రిన్సిపల్ ఛీఫ్ సెక్రటరీగా పని చేసిన ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజామున సూళ్ళూరుపేటలోని తన రెండో కొడుకు నివాసంలో తుది శ్వాస విడిచారు. By Manogna alamuru 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam : శ్రీశైలంలో రూ.19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం..ధర్మకర్తల మండలి నిర్ణయం.! శ్రీశైలవాసులకు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ. 19కోట్ల అంచనా వ్యయంతో 30 పడకలు ఆసుపత్రిని నిర్మించాలని శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది. దేవస్థానం గోసంరక్షణశాలలో రూ. 36లక్షల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానించారు. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn