/rtv/media/media_files/2024/11/01/fo1JtU9nA4uwurdz1lwa.jpg)
TTD
తిరుమల తిరుపతి వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగియనున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు అర్చకులు వైకుంఠ ద్వారాలను మూసి వేయనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 10న వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించారు. నేటి అర్థరాత్రి ఏకాంత సేవతో వీటిని క్లోజ్ చేస్తున్నారు. మళ్లీ వైకుంఠ ద్వారాలు ఈ ఏడాది డిసెంబర్‌లో ముక్కోటి ఏకాదశికి తెరుచుకోనున్నాయి.
మొత్తం పది రోజుల పాటు..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొత్తం పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. దాదాపుగా 6.82 లక్షల మంది భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. ఈ టికెట్లు జారీ చేసే సమయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చూడండి: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!
నేటితో వైకుంఠ ద్వారాలు మూసివేయడంతో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు వెళ్లారు. దీంతో సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడ చూసిన జనం ఎక్కువగా కనిపిస్తున్నారు. దర్శన సమయం కూడా పెరగనుంది. శ్రీవారి దర్శనం కోసం కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఇది కూడా చూడండి: Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
ఇదిలా ఉండగా.. ఇటీవల తిరుమల కొండపై అపచారం జరిగింది. ఓ కుటుంబం కోడిగుడ్ల కూర, పలావ్ తీసుకుని కొండపైకి వెళ్లారు. తమిళనాడుకి చెందిన ఓ కుటుంబం కొండపైన వీటితో భోజనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వారికి తెలియక ఇలా చేశారని ఆ కుటుంబం తెలిపింది. దీంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని పంపించారు.
ఇది కూడా చూడండి:RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!