/rtv/media/media_files/2024/11/13/TtWpzgdHdaaug5UkJdau.jpg)
sri reddy
ప్రస్తుతం వైసీపీ పార్టీ నుంచి కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో శ్రీరెడ్డి పార్టీని వదిలి ఎవరూ వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం వైసీపీ పార్టీ కష్టకాలంలో ఉందని, దయ చేసి ఎవరూ కూడా పార్టీ విడిచి వెళ్లవద్దు. ప్లీజ్ కాస్త ఓపికతో ఉండి.. జగన్ అన్నకు సపోర్ట్ చేయండని ఆమె కోరింది.
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అర్థరాత్రి ఏం జరిగిందంటే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
రవి చంద్రారెడ్డి రాజీనామా బాధాకరం..
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లడం కరెక్ట్ కాదని ఆమె తెలిపింది. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో ఈ సందర్భంగా ఆమె స్పందించింది. రవి చంద్రారెడ్డి రాజీనామా బాధించిందని, ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించే హక్కు తనకు లేదని తెలిపింది. ఆయన స్పీచ్‌లు బాగుంటాయని, అలాంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చేయడం బాధిస్తుందని శ్రీ రెడ్డి వెల్లడించారు.
ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!
కనీసం సైలెంట్‌గా అయినా..
పార్టీలో యాక్టివ్‌గా లేకపోయినా కూడా కనీసం సైలెంట్‌గా అయిన పార్టీలో ఉండండని తెలిపింది. ఇలాంటి కష్ట సమయాల్లో జగన్‌కు సపోర్ట్ చేయాలని ఆమె తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి రాజీనామా చేయవద్దని తెలిపింది. మాకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా జగన్‌కు సపోర్ట్‌గా ఉంటామని శ్రీరెడ్డి వెల్లడించారు. ఇలాంటి కష్ట సమయాల్లో పార్టీకి సపోర్ట్‌గా ఉంటే.. ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని ఆమె అన్నారు. అందుకే తాను వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు.
ఇది కూడా చూడండి: Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్
ఇది కూడా చూడండి: Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు