AP: పండుగ పూట ఏపీలో పెను విషాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!

వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా ఘోర ప్రమాద ఘటన ఏపీలో చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు కాకినాడలోని వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా మినీ వ్యాన్ అదుపు తప్పి కాలువలో పడింది. దీంతో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లో మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

New Update
karnul accident

Accident Photograph: ( Accident)

AP: పండుగ పూట ఏపీలో పెను విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఒమ్మంగి శివారులో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కాలువలో మినీ వ్యాన్ పడిపోవడంతో స్పాట్‌లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు

ఇది కూడా చూడండి: Saif Ali khan: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే

వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం..

స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పండుగ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఓ వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 20 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్

ఇదిలా ఉండగా ఇటీవల వరంగల్ హైవేపై కూడా ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన వారు మృతి చెందారు. ఒక మహిళ, చిన్నారి రోడ్డు అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు పోలీసులకు ప్రమాదంపై సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. క్షతగాత్రులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

పెట్రోల్ పంపులోకి వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాద సంభవించినట్లు తెలుస్తోంది. కారు పూర్తిగా లారీకి వెనుక భాగంలో ఇరుక్కుపోవడంతో జేసీబీ సహాయంతో బయటకు తీసి వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌లు..డేంజర్‌లో మీ ఆరోగ్యం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు