Tirupathiలో విషాదం.. మొదటి అంతస్తు నుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి

మొదటి అంతస్తు నుంచి మూడేళ్ల బాలుడు కింద పడి మృతి చెందిన విషాద ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కడప జిల్లాకి చెందిన ఓ కుటుంబం దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. పద్మనాభ నిలయం దగ్గర మూడేళ్ల బాలుడు ఆడుతూ ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి కింద పడ్డి మృతి చెందాడు.

New Update
Crime: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..నోట్లో పొగాకు కుక్కి!

tirupathi

తిరుపతిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కడప జిల్లాకి చెందిన ఓ కుటుంబం తిరుపతి వెళ్లారు. అక్కడ పద్మనాభ నిలయం వద్ద మూడేళ్ల కుమారుడు తన సోదరుడితో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో మొదటి అంతస్తు మెట్లు గ్రిల్‌పై నుంచి అకస్మాత్తుగా పడి మృతి చెందాడు. మూడేళ్ల కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

ఇది కూడా చూడండి: Saif Ali khan: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే

వాటర్ ఫాల్స్‌కి వెళ్లి వస్తుండగా..

ఇదిలా ఉండగా.. పండుగ పూట ఏపీలో పెను విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఒమ్మంగి శివారులో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కాలువలో మినీ వ్యాన్ పడిపోవడంతో స్పాట్‌లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఇది కూడా చూడండి: Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌లు..డేంజర్‌లో మీ ఆరోగ్యం

స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పండుగ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఓ వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 20 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ కావడంతో కుటుంబ సభ్యులు అందరూ సరదాగా బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇలా ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందడంతో పండగ పూట ఇంట్లో విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగ అని అందరూ ఒక దగ్గర చేరుకున్నారు. కానీ ఇలా జరగడంతో బాధపడుతున్నారు. 

ఇది కూడా చూడండి: Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!

ఇది కూడా చూడండి:  Kareena Kapoor: భర్త పై దాడి.. స్పందించిన కరీనా కపూర్, ఏం చెప్పారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు