/rtv/media/media_files/2025/03/03/6zmPVYoxlvuHIrpocQmz.jpg)
IND VS NZ VIRAT AND AXAR PATEL
భారత్ vs న్యూజిలాండ్ (IND v/s NZ) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. కివీస్ బ్యాటింగ్ సమయంలో కింగ్ కోహ్లీ (Virat Kohli) చేసిన పని అందరినీ షాక్‌కి గురి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు, అభిమానులు అతడిని ఒక హీరోలా కొలుస్తుంది. కానీ కోహ్లీ మాత్రం నిన్న మ్యాచ్‌లో చేసిన పని వల్ల ఏం జరిగింది అంటూ క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
విరాట్ కోహ్లీ తిన్నాగా వెళ్లి అక్షర్ పటేల్ (Axar Patel) కాళ్లు మొక్కబోయాడు. అది గమనించిన అక్షర్ వెంటనే కిందకి కూర్చుని నవ్వుతూ ఉండిపోయాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆ సంఘటన చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అని గుసగుసలాడుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం.
Also read : SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
భారత్ -, న్యూజిలాండ్ మధ్య నిన్న రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఒకానొక సమయంలో భారత్ ఓడిపోతుందా? అనే డౌట్ అందరిలోనూ కలిగింది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ ఆదిలోనే అంతమయ్యేలా కనిపించింది. అతి తక్కువ సమయంలోనే వికెట్లు కోల్పోయింది. తర్వాత శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తమదైన శైలిలో స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లారు. నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.
Also read : ఐదో సారి తల్లి కాబోతున్న సీమా హైదర్... తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !
విలియమ్సన్ ఔట్
ఇక ఈ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ మొదటి నుంచి మంచి ఫామ్ కనబరిచింది. కానీ భారత బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. కేవలం 43.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ దూకుడుగా ఆడాడు. అతడు క్రీజ్‌లో ఉన్నంత వరకు భారత్‌కు ఓటమి తప్పదు అనే సందేహాలు కలిగాయి. ప్లేయర్లలోనూ అదే భయం ఉండేది. కేన్ విలియమ్సన్ ఎప్పుడెప్పుడు ఔట్ అవుతాడా? అని ఎదురుచూశారు. అదే సమయంలో భారత్ స్పిన్నర్ అక్షర్ పటేల్ వేసిన బంతికి విలియమ్సన్ పెవిలియన్‌కు చేరాడు.
Also read : Oscar Awards 2025 : ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!
After Kane Williamson's wicket, Virat Kohli tried to touch Axar Patel's feet in a light-hearted moment on the field displaying excellent camaraderie among the Indian players.#ChampionsTrophy2025 #INDvsNZ #ViratKohli pic.twitter.com/wVcn2GgTVt
— Priyanshi Bhargava (@PriyanshiBharg7) March 3, 2025
అక్షర్ కాళ్లు పట్టుకోబోయిన విరాట్
దీంతో అప్పటి వరకు ఆశలు పెట్టుకున్న న్యూజిలాండ్ ఓటమి పాలైంది. ఇక ఈ వికెట్‌ను తీసిన అక్షర్ పటేల్‌ను అభినందించే క్రమంలో కోహ్లీ చేసిన విన్యాసం చూపరులను ఆకట్టుకుంది. అక్షర్ పాదాలను పట్టుకునేందుకు విరాట్ కోహ్లీ ప్రయత్నించాడు. అదే సమయంలో అక్షర్ నవ్వుతూ కింద కూర్చోవడం అందరిలోనూ నవ్వులు పూయించింది. అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌గా మారాయి.