BCCI: ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్‌గా రోహిత్ వైపే బీసీసీఐ మొగ్గు

వరుసగా విఫలమవుతున్నా రోహిత్, విరాట్ కోహ్లీలకు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటోంది బీసీసీఐ. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అంటున్నారు.దీంతో పాటూ ఇంగ్లండ్ వన్డే, టీ20 సీరీస్‌లకు కూడా బీసీసీఐ స్క్వాడ్లను ప్రకటించే అవకాశం ఉంది. 

New Update
india

Rohith Sharma

ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. జరిగిన ఐదు టెస్ట్‌లలో ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా అతను సరైన స్కోరు సాధించలేదు. దాంతో పాటూ జట్టుకు విజయాలను కూడా అందించలేకపోయాడు. చివరి టెస్ట్‌ లో ఏంగా ఆడకుండా పక్క కూర్చొన్నాడు. ఫలితంగా ఆసీస్ 3–1 తేడాతో టెస్ట్ సీరీస్‌ను సొంతం చేసుకుంది. దానికితోడు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్​హతను సంపాదించింది.

Also Read :  దెబ్బలు పడ్డాయి రోయ్ ... రమేశ్‌ బిధూడీ టికెట్ ఊస్ట్ !

వాళ్లిద్దరూ ఆడతారు..

ఆస్ట్రేలియా టూర్ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లకు తరువాత ట్రోఫీల్లో విశ్రాంతి ఇస్తారనుకున్నారందరూ. కొంతమంది అయితే రోహిత్ శర్మ రిటైర్ అయిపోతాడని కూడా చెప్పేశారు. కానీ ఇవేవీ నిజం కాలేదు. రోహిత్ తాను అప్పుడే రిటైర్ అవనని తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు బీసీసీఐ కూడా రోహిత్, విరాట్‌లకు మరో ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అయింది.  ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించేందుకు సెలక్షన్ కమిటీ సమాయత్తమవుతోంది. ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు స్క్వాడ్‌లను ప్రకటించాల్సి ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 

Also Read: Tibet: టిబెట్ లో మృత్యుఘోష..ఇప్పటివరకు 126మంది మృతి

మరోవైపు మోకాలి వాపు కారణంగా ఆస్ట్రేలియా సీరీస్‌కు దూరంగా ఉన్న బౌలర్ మహ్మద్ షమీ ఇప్పుడు మళ్ళీ జట్టులోకి తిరగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.  దీంతో అతనిని ఇంగ్లండ్ సీరీస్‌లకు ఎంపిక చేస్తారని చెబుతున్నారు ఐసీసీ టోర్నీల్లో సూపర్ రికార్డ్ ఉన్న షమీ మళ్ళీ జట్టులోఇ వస్తే అదను బలం చేకూరినట్టే అవుతుంది. అయితే మరోవైపు బుమ్రా పరిస్థితి ఆందోళనరంగా మారింది. ఆసీస్ సీరీస్‌లో చివరి టెస్ట్‌లో బుమ్రా వెన్నునొప్పి కారణంగా సగం ఆట మధ్యలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోపీకి కూడా వస్తాడా లేదా అనేది సందేహంగా మారింది. జనవరి 12 లోపు ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం బీసీసీఐ (BCCI) జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ఆడనున్న భారత జట్టే.. ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా ఉండొచ్చని చెబుతున్నారు. 

Also Read: USA: బందీలను విడిచిపెట్టకపోతే మీ పని అంతే..హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

Also Read :  వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం..  37ఓవర్లకు మ్యాచ్ కుదింపు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

టోక్యో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానును ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 49కేజీల విభాగంలో రజతం గెలుచుకున్నారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు.

New Update
_Mirabhai Chanu

టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరా భాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. చైర్‌పర్సన్‌గా నియమించినందుకు వెయిట్ లిఫ్టింగ్ కమిషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన తోటి వెయిట్‌లిఫ్టర్ల వాయిస్ వినిపించేందుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఆమెకు చాలా గర్వకారణమని అన్నారు. అని టోక్యో పతక విజేత మీరాబాయి ఒక ప్రకటనలో తెలిపారు.

మీరాబాయి రెండుసార్లు 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని, 2022లో రజతాన్ని గెలుచుకుంది. మీరాబాయి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకుంది. ఆమెతోపాటు కమీషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత. వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు, పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు. 

#Mirabhai Chanu #Weightlifting Federation #chairperson #Weightlifter
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు