Niharika:అమెరికా వీధుల్లో మెగా అమ్మాయి గ్లామర్ షో

మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక. మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యాంకరింగ్ తో మొదలెట్టి, నటిగా మారింది. తర్వాత ప్రొడ్యూసర్ అయింది. నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను పెడుతూ సందడి చేస్తుంది. తాజాగా నిహారిక యూఎస్ వెళ్ళానంటూ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను పెట్టింది.

New Update
Niharika:అమెరికా వీధుల్లో మెగా అమ్మాయి గ్లామర్ షో

విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత నిమారికా సోలో లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా ఫ్యామిలీతో ఆఫ్రికా వెళ్ళొచ్చింది. ఇప్పుడ మళ్ళీ అమెరికా వెళ్ళింది. అక్కడ తన ఫోటోలను డిజిటల్ లైబ్రరీ అంటూ సోసల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిహారికా చాలా బావుంది, హాట్ గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

నిహారిక హీరోయిన్ గా చేసిన సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు. దీంతో, తనకు తానుగా సినిమాల నుంచి తప్పుకుంది. తర్వాత పెళ్లి చేసుకుంది. అయితే, కొంతకాలానికే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె మరింత ఎక్కువ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. నటిగా, ప్రొడ్యూసర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు సోలో ట్రిప్స్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్లో చేస్తోంది. అమెరికాలోని రోడ్స్ మీద ఫోటోలు తీసుకుంటూ...రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ ఆస్వాదిస్తోంది. డిఫరెంట్ డ్రెస్సుల్లో ఫోటోలు తీసుకుని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సూపర్ నిహారిక అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నిహారిక యాక్ట్ చేసింది. అందులోనూ బోల్డ్ డైలాగులతో షాకిచ్చింది. వెబ్ సిరీస్ లో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లోనూ నిహారిక బోల్డ్ గా మారిందనే కామెంట్స్ వినపడుతున్నాయి.

ఇక, త్వరలోనే మెగా ఇంట పెళ్ళి సంబరాలు జరగనున్నాయి. నిహారిక సోదరుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్ళి చేసుకోనున్నారు. ఈ పెళ్ళి పనులను నిహారిక స్వయంగా చూసుకుంటోందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: నాల్గవవారం నామినేషన్స్ లో రచ్చ…శివాజీ ఓవర్ యాక్షన్

ఉదయాన్ని టీ తాగితే డేంజర్.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aamir Khan Mahabharata డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' అమీర్ భారీ ప్లానింగ్.. రూ.. 1000 కోట్లతో..!

అమీర్ ఖాన్ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'మహాభారతాన్ని' వెండితెరపై చూపించాలనేది తన కల అని చెప్పారు. ఈ సంవత్సరం దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

New Update
Aamir Khan

Aamir Khan

Aamir Khan:  బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం  'సితార్ జమీన్ పర్' సినిమాతో బిజీగా ఉన్నారు. తరచూ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కొత్త అప్డేట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చాలాకాలంగా అమీర్ ఖాన్ అతిగొప్ప ఇతిహాసమైన  'మహాభారతాన్ని' వెండితెర పై చూపించాలని ప్రయత్నిస్తున్నారు. 

'మహాభారతం' నా కల 

ఈ ప్రాజెక్ట్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ..  నేటి తరానికి మహాభరతాన్ని అందించాలనేది తన కల అని  చెప్పారు . ఈ ఏడాది దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీని స్క్రిప్టింగ్ కి కొన్ని సంవత్సరాలు పడుతుందని..  ఒకే సినిమాలో స్టోరీ అంతా చూపించలేమని అన్నారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' తరహాలో  సీరీస్ లుగా అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  ఎంతోమంది డైరెక్టర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నారు. స్టోరీ రాసుకున్న తర్వాత పాత్రలకు సరిపోయే నటీనటుల ఎంపిక చేస్తాము.  అమీర్ ఈ చిత్రంలో నటిస్తాడా లేదా? అని ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. 

1000 కోట్ల..

అమీర్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం 2018లో రాకేష్ శర్మ బయోపిక్ నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అమీర్ ఖాన్ దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో  'మహాభారతాన్ని' రూపొందించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

ఇదిలా ఉంటే.. 2022లో 'లాల్ సింగ్ చద్దా' ఊహించని పరాజయంతో కొంతకాలం బ్రేక్ తీసుకున్న అమీర్.. ప్రస్తుతం ' సీతారే జమీన్ పర్' చేస్తున్నారు. 2007 లో వచ్చిన సూపర్ హిట్ తారే జమీన్ పర్ సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. 

latest-news | cinema-news | Aamir Khan Mahabharat

Also Read: Singer Sunitha: ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత సంచలన వీడియో.. అసలు నిజం ఇదే!

Advertisment
Advertisment
Advertisment