Food Poisoning : ముంబయి తీవ్ర విషాదం.. బిర్యానీ, పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలుగురి మృతి

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంధువులతో కలిసి బిర్యానీ ఆరగించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, కేవలం 12 గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. ఫుడ్ పాయిజనింగ్ దీనికి కారణమని పోలీసులు, వైద్యులు అనుమానిస్తున్నారు.

New Update
FotoJet - 2026-04-27T205621.160

family die after eating biryani and watermelon

మహారాష్ట్ర(maharastra) రాజధాని ముంబయి(mumbai) లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంధువులతో కలిసి విందు ఆరగించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, కేవలం 12 గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. ఫుడ్ పాయిజనింగ్(food poisioning) కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని పోలీసులు, వైద్యులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ముంబయిలోని పైధోనీ ప్రాంతానికి చెందిన అబ్దుల్లా అబ్దుల్ కాదర్ (40) ఒక మొబైల్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య నస్రీన్ (35), వారికి ఇద్దరు కుమార్తెలు (ఒకరి వయసు 13 ఏళ్లు)(family) ఉన్నారు. శనివారం రాత్రి అబ్దుల్లా కుటుంబం తమ బంధువుల ఇంట్లో జరిగిన ఒక విందుకు హాజరయ్యారు. అక్కడ అందరూ కలిసి బిర్యానీ(biryani) ని భుజించారు. విందు ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాక, అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆ కుటుంబ సభ్యులందరూ పుచ్చకాయ(water-melon) తిన్నారు.

Also Read :  భారత్-న్యూజిలాండ్ మైత్రి... కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Mumbai Tragedy - 4 Members Dead

 ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కుటుంబంలోని నలుగురికీ ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో అబ్దుల్లా వెంటనే స్థానిక వైద్యుడిని పిలిపించారు. అయితే అప్పటికే వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో, అంటే అస్వస్థత మొదలైన కేవలం ఐదు గంటల్లోనే నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆకస్మికంగా మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పైధోనీ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

రాత్రి తిన్న బిర్యానీ లేదా ఆ తర్వాత తిన్న పుచ్చకాయ కారణంగా విషాహారం (Food Poisoning) జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విందులో వడ్డించిన ఆహారం, ఇంట్లో తిన్న పుచ్చకాయ నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. మరణానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఆ నివేదిక వస్తేనే మరణం వెనుక ఉన్న అసలు కారణం స్పష్టమవుతుంది.సంతోషంగా గడపాల్సిన విందు సమయం, ఇలా ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకోవడంతో అబ్దుల్లా బంధువుల ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. బయటి ఆహారం తీసుకునేటప్పుడు, ముఖ్యంగా వేసవి కాలంలో పండ్లు, ఆహార పదార్థాల కలయిక విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read :  నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం

Advertisment
తాజా కథనాలు