🔴Live News: భార్యతో గొడవ.. నలుగురు పిల్లల గొంతు కోసి కిరాతకంగా చంపిన తండ్రి

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 27, 2025 13:16 IST

    భార్యతో గొడవ.. నలుగురు పిల్లల గొంతు కోసి కిరాతకంగా చంపిన తండ్రి

    యూపీలోని షాజహాన్పూర్‌లో దారుణం జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి తన భార్య కంతీదేవితో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. ఆ కోపంలో తన నలుగురు పిల్లల(స్మృతి, కీర్తి, ప్రగతి, రిషబ్) గొంతు కోసి హతమార్చాడు. ఆపై అతడు కూడా ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.



  • Mar 27, 2025 11:13 IST

    తెలంగాణలో మళ్లీ టెన్త్ పేపర్ లీక్!

    తెలంగాణలో మరోసారి టెన్త్ ఎగ్జామ్ పరీక్ష లీక్ కలకలం సృష్టిస్తోంది. కామారెడ్డి జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల నుంచి గణిత ప్రశ్నపత్రంలోని కొన్ని ప్రశ్నలు లీక్ అయ్యాయి. అక్కడపనిచేసే సిబ్బంది కాగితం ప్రశ్నలను రాయించి బయటకు పంపాడు.

    Telangana 2025  10th paper leaked
    Telangana 2025 10th paper leaked

     



  • Mar 27, 2025 11:12 IST

    తిరుమలలో అపచారం.. ఆలయ గోపురం మీదుగా విమానం.. TTD ఆగ్రహం



  • Mar 27, 2025 11:11 IST

    షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్‌ మెడిసిన్ ధరలు

    ప్రభుత్వ నియంత్రణలోని డయాబెటిస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు వాడే ఔషదాల ధరలు పెరగనున్నాయి. వీటిలో క్యాన్సర్‌, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతోసహా ఇతర వ్యాధులకు సంబంధించిన యాంటీబయాటిక్స్‌ కూడా ఉన్నాయి. వీటి ధరలు 1.7 శాతం పెరిగే అవకాశం ఉంది.

    medicen
    medicen Photograph: (medicen)

     



  • Mar 27, 2025 11:10 IST

    పాస్టర్ ప్రవీణ్ ను పక్కా ప్లాన్ తో చంపేశారు.. ఇదిగో ప్రూఫ్స్.. షర్మిల సంచలన ప్రకటన!



  • Mar 27, 2025 07:27 IST

    భార్య అక్రమ సంబంధం.. లవర్తో రెండో పెళ్లి చేసిన భర్త!

    ఉత్తరప్రదేశ్‌లోని వింత ఘటన చోటుచేసుకుంది. సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ భర్త తన భార్యకు రెండో పెళ్లి చేశాడు. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా, ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకున్నాడు.

    husband-and-wife
    husband-and-wife

     



  • Mar 27, 2025 07:24 IST

    టీ20 క్రికెట్లో యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు

    టీమిండియా క్రికెటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. జైస్వాల్ తన 106వ మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు.

    Yashasvi-Jaiswal



Advertisment
Advertisment
Advertisment