/rtv/media/media_files/2025/03/30/kUXEW1chtmUPYZ6dhgg7.jpg)
stalin tn
తమిళనాడులో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారు? అంటే ఎక్కువ మంది తమిళులు.. డీఎంకే అధినేత, ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్‌వైపే మొగ్గు చూపుతున్నారు. తర్వాతి స్థానంలో టీవీకే అధ్యక్షుడు, ఇళయ దళపతి విజయ్.. ప్రధాన ప్రతిపక్షనేత, మాజీ సీఎం ఎడప్పాడి పళనిసామి ఉన్నారు. ఈ మేరకు సీ ఓటర్స్ సంస్థ ప్రజాభిప్రాయసేకరణలో ఈ విషయం తెలిసింది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయ పరిస్థితులపై సీ ఓటర్ సర్వే నిర్వహించి, ఫలితాలు వెల్లడించింది.
Also Read: Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ !
ప్రస్తుతం ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరుండాలి? అనే ప్రశ్నకు అత్యధికంగా 27 శాతం మంది స్టాలిన్ పేరే చెప్పుకొచ్చారు. రెండో స్థానంలో ఉన్న విజయ్‌కు 18 శాతం, ఎడప్పాడి పళనిసామికి 10 శాతం, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైకు 9శాతం మంది మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సర్వే ద్వారా తమిళనాడులో స్టాలిన్‌కు తిరుగులేదని రుజువయ్యింది. ఆయన తర్వాత ప్రజాదరణ కలిగిన నేతగా విజయ్ ఉన్నారని తెలిసింది.
Also Read: Standup Comedian: తల్లి మీద జోకులు..వివాదంలో స్టాండ్ అప్ కమెడియన్!
డీఎంకే ప్రభుత్వ పనితీరుపై 50 శాతం మందికి పైగా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.. ఇందులో 15శాతం మంది అత్యంత సంతృప్తికరంగా ఉందని, 36 శాతం మంది సంతృప్తికరంగా ఉందని చెప్పారు. 25శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. 24 శాతం మంది ఏమీ చెప్పలేమని సమాధానం దాటవేశారు. సీఎంగా ఎంకే స్టాలిన్ పాలన, పనితీరు ఎలా ఉందనే ప్రశ్నకు... 22 శాతం మంది అత్యంత అద్భుతంగా ఉందని, 33 శాతం మంది సంతృప్తికరంగా ఉందని చెప్పారు. 22 శాతం మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, 23 శాతం మంది సమాధానం చెప్పడం కష్టమని తెలిపారు. మొత్తంగా చూస్తే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే సర్కారుపై అత్యధికశాతం మంది తమిళులు సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
అయితే, రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమైన సమస్యల విషయానికి వస్తే.. 15 శాతం మంది మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని 12 శాతం, మాదక ద్రవ్యాల సమస్య ఎక్కువగా ఉందని 10 శాతం, నిరుద్యోగ సమస్యపై 8 శాతం మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇక, నియోజకవర్గాల విషయానికి వస్తే ఎమ్మెల్యే పనితీరుపై అడిగిన ప్రశ్నకు 16శాతం మంది మాత్రమే సంతృప్తి చెందారు. కాగా, తమిళనాడు శాసనసభకు మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే మార్చి- ఏప్రిల్‌లో అక్కడ ఎన్నికలు జరుగుతాయి.
Also Read: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
tamilanadu | dmk | dmk-party | stalin | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | elections | survey