![Amit Shah Released BJP 3rd Manifesto](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/25/56MKdmA18MQvwi6YDqF7.jpg)
Amit Shah Released BJP 3rd Manifesto
Delhi Elections: ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార, విపక్ష పార్టీలు వరాలు జల్లులు కురిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు విడుదతల్లో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ(BJP).. తాజాగా మరో మేనిఫెస్టోను ప్రకటించింది. సంకల్ప పత్ర పార్ట్ -3(Sankalp Patra Part-3) పేరుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) దీన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి వివరించారు. ''ఆప్ ప్రభుత్వం ఢిల్లీకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిలయ్యింది. కలుషితంగా మారిన యమునా నదిని వారు శుభ్రం చేయించలేదు. సరైన తాగునీటి సౌకర్యాన్ని అందించలేదు. కేజ్రీవాల్ నేతృత్వంలో అవినీతి పెరిగిపోయింది.
Also Read: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై వందేభారత్ రైలు పరుగులు, వీడియో వైరల్
యమునా నదిని పరిశుభ్రం చేస్తాం..
బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా పరిశుభ్రంగా చేస్తాం. గిగ్ వర్కర్ల కోసం బోర్డును వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం. 1700 అనధికార కాలనీల్లో కొనుగోలు, అమ్మకం, నిర్మాణం ఇలా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తాం. రూ.10 లక్షల ఆరోగ్య బీమా అలాగే రూ.5 లక్షల ప్రమాదం బీమా అందజేస్తాం. 50 వేల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తాం. 20 లక్షల స్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తాం.
Also Read: అసలైన ఆఫర్ అంటే ఇదే.. కేవలం రూ.26లకే స్మార్ట్ వ్యాచ్
మేము అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను అమలు చేస్తామని'' మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అమిత్ షా వివరించారు. ఇదిలాఉండగా ఆప్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇప్పటికే తమ మేనిఫెస్టోలు విడుదల చేశాయి. ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే ఈసారి దేశ రాజధానిలో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: పాకిస్థాన్ జైళ్లో భారతీయ ఖైదీ మృతి.. శిక్షా కాలం పూర్తయినప్పటికీ.. !
Also Read: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?