Tariff War : సుంకాలతో డిష్యూం డిష్యూం..యూఎస్- చైనా- కెనడా వార్

అమెరికా, కెనడా, చైనా ల మధ్య సుంకాల వార్ తీవ్రత ఎక్కువైంది. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా సుంకాలు విధించుకుంటున్నారు. అమెరికా 20 శాతం సుంకాలు విధిస్తుంటే...దానికి ప్రతిగా చైనా 15శాతానికి పెంచింది. 

New Update
usa

Tariff War

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) నిర్ణయాలు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను దారి తీస్తోంది. చైనా (China) పై ఇంతకు ముందు పదిశాతం ఉన్న దిగుమతి సుంకాన్ని ట్రంప్ 20 శాతానికి పెంచారు. దీనిపై చైనా మొదటి నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉంది. అయినా కూడా ట్రంప్ ఎవరి మాటా వినకుండా నిన్నటి నుంచి ఈ సుంకాలను అమల్లోకి తీసుకువచ్చారు. దీంతో ఒళ్ళుమండిన చైనా దానికి ప్రతిగా 15శాతం సుంకాలతో దాడికి దిగింది. జొన్నలు, సోయాబీన్, పోర్క్, బీఫ్, చేపలు, రొయ్యలు, పీతలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులపై 10 శాతం.. చికెన్, గోధుమ, మొక్కజొన్న, పత్తి లాంటి ఉత్పత్తులపై 15 శాతం సుంకాలు విధించింది. మార్చి 10 నుంచి అవి అమల్లోకి వస్తాయని చైనా ప్రభుత్వం ప్రకటించింది.  అంతేకాదు అమెరికాకు చెందిన రక్షణ, భద్రత, ఏఐ, విమాన, ఐటీ సంస్థలపై ఆంక్షలు విధించింది. అయితే దీనిపై అమెరికాతో తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

Also Read :  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Also Read :  కోడిని కోశావా.. కోడి మిస్సింగ్ కేసులో వ్యక్తికి పోలీసుల థర్డ్ డిగ్రీ

కెనడా సైతం...

చైనా సంగతి అలా ఉంటే... కెనడా, మెక్సికో ఉత్పత్తులపై ఏకంగా 25శాతం సుంకాలను బాదేశారు ట్రంప్. దీనిపై కెనడా మండిపడుతోంది. అమెరికా అలా ఎలా చేస్తుంది అంటూ...ప్రతీకార చర్యగా కెనడా ప్రభుత్వం 25శాతం సుంకాలను విధించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 107 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudo) ప్రకటించారు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని కూడా తెలిపారు. ఈ పెరిగిన సుంకాల కారణంగా అమెరికా ప్రజల నిత్యావసర గ్యాస్, కార్లపై అధిక ధరలను చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. మరోవైపు మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షీన్ బాయ్ కూడా ఈ సుంకాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఆదివారం ప్రకటిస్తానని తెలిపారు.  ఈలోపు అమెరికా ఏమైనా తగ్గుతుందేమోననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు క్లౌడియా.

Also Read: UP: కుంభమేళా వల్ల పడవలు నడిపే వ్యక్తికి రూ. 30 కోట్ల ఆదాయం..యోగి ఆదిత్య నాథ్

Also Read :  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు