/rtv/media/media_files/2025/04/06/as7MT0KzdmKlMxcYeiAx.jpg)
morgan
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమల్లోకి తీసుకుని వచ్చిన ప్రతీకార సుంకాలు దేశ భవిష్యత్తు పై పెను ప్రభావం చూపుతాయని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది. 1.3 శాతం గా ఉన్న జీడీపీ మైనస్0.3 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఫలితంగా అగ్రరాజ్యంలో ఈ ఏడాదే ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.
Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
అమెరికా స్థూల దేశీయోత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్ కు చెందిన ఆర్థిక వేత్త మైఖేల్ ఫెరోలి వెల్లడించారు. ప్రపంచ దేశాల పై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలే ఇందుకు ప్రధాన కారణమని ,ఆర్థిక మాంద్యంతో అమెరికాలో నిరుద్యోగ రేటు 5.3 శాతానికి పెరగనుందని ఆయన అంచనా వేశారు.
Also Read: Rain Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు హెచ్చరికలు!
JP Morgan Predicts Recession In US
కార్మిక విభాగ నివేదికల ప్రకారం మార్చిలో నిరుద్యోగ రేటు 4.2 శాతంగా ఉన్నట్లు తెలిపారు. మార్చిలో ఉద్యోగ నియామకాలు బలంగా ఉన్నప్పటికీ ప్రతీకార సుంకాల ప్రభావంతో క్రమంగా తగ్గే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తల అంచనా.రాబోయే రోజుల్లో నిత్యావసర ధరలు పెరగడం సహా వృద్ధి రేటు మందగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులు 20 శాతం కంటే ఎక్కువగానే తగ్గనున్నట్లు మరో ఆర్థిక వేత్త జోనాథన్ పింగిల్ అంచనా వేశారు.రాబోయే త్రైమాసికాల్లో అమెరికా జీడీపీలో దిగుమతులు 1986 ముందు స్థాయిలకు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. భారత్ సహా అన్ని ప్రపంచ దేశాల పై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్.దీంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి.అమెరికాతో పాటు అన్ని ప్రధాన మార్కెట్లు పతనమవుతున్నాయి.
ప్రస్తుత సుంకాల పరిణామాలను ఆర్థికవిప్లవంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇది సవాళ్లతో కూడుకున్నదని ,చివరకు విజయం తమదేనని స్పష్టం చేశారు. అమెరికాతో పోలిస్తే చైనాకు పెద్దదెబ్బ తగిలింది. చైనాతో పాటు అనేక ఇతర దేశాలు మనతో అన్యాయంగా వ్యవహరించాయి. మనం మౌనంగా , నిస్పహాయంగా మిగిలిపోయాం. ఇక పై ఆ పరిస్థితి ఉండదు.
ఉద్యోగాలు,వ్యాపారాలను గతంలో ఎన్నడూ లేని విధంగా తిరిగి తీసుకొస్తున్నాం.ఇప్పటికే 5 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు సాధించాం. ఇదొక ఆర్థిక విప్లవం.ఇందులో మనం విజయం సాధిస్తాం. అయితే..ఇదేమీ అంత సులభం కాదు.కానీ తుది ఫలితం చరిత్మాత్రకంగా ఉంటుంది అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ విధిస్తున్న సుంకాలు అమెరికాకు మేలు చేస్తాయని తాను భావించడం లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు.
Also Read: Ukraine: పేరుకే అగ్రరాజ్యం..చేసేవన్నీ బలహీనమైన పనులే..అమెరికాపై జెలెన్ స్కీ విమర్శలు
Also Read: Musk: యూఎస్-యూరప్ ల మధ్య సుంకాలుండవు..మస్క్ సంచలన వ్యాఖ్యలు!
latest telugu news updates | latest-telugu-news | telugu-news | tarriffs | america | jp morgan | trump tariffs | today-news-in-telugu | donald-trump | breaking news in telugu | international news in telugu