ఆంధ్రప్రదేశ్ Pharma : ఫార్మాసిటీ ఫార్మా ఉద్యోగి మిస్సింగ్ విశాఖ లో ఓ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసే సూర్య నారాయణ అనే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు. సూర్యనారాయణ విధులకు హాజరైనట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది.కానీ డ్యూటీ తరువాత బయటకు వెళ్లినట్టు లేదు. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: చిన్నారిని పీక్కుతున్న వీధి కుక్కలు.. తెలంగాణలో మరో దారుణం! బోధన్ పట్టణంలో వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. కొత్త బస్టాండ్ ప్రాంతంలో చెట్టు కింద ఉన్న చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో మాంసపు ముద్దలను గుర్తించారు. బాలుడిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్టు నిర్ధారించారు. By Vijaya Nimma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Train Accidents : భారత్‌లో రైలు ప్రమాదాలు.. పాకిస్థాన్ కుట్రేనా ? ఇండియాలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. NCRB లెక్కల ప్రకారం 2013-2023 మధ్య జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. By B Aravind 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident : అర్థరాత్రి ఘోర ప్రమాదం..ఏడుగురు దుర్మరణం! ఏలూరు జిల్లా బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయల్దేరిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..వారిలో ఒకరు పరారీలో ఉన్నారు. By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బీహార్‌లో షాకింగ్ ఘటన..గన్‌తో పిల్లాడు క్లాస్ రూమ్‌లోకి ఎంట్రీ అమెరికాలో గన్ కల్చర్ ఉంది. అక్కడకు పిల్లలు స్కూలుకు గన్ తీసుకెళ్ళి కాల్పులు జరుపుతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే సంఘటన ఇండియాలో జరిగితే..అమ్మో ఇంకేమైనా ఉందా..కానీ బీహార్‌లో ఓ పిల్లాడు సరిగ్గా ఇదే చేశాడు. వివరాలు ఏంటో చూసేయండి. By Manogna alamuru 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: అమెరికాలో నీట మునిగి ఇద్దరు తెలుగు చిన్నారులు మృతి! అమెరికాలో ఇద్దరు తెలుగు చిన్నారులు ఓ సరస్సులో మునిగి చనిపోయారు. న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ లోని హెల్ట్స్ విల్లేలోని ఓ అపార్ట్మెంట్ లో డేవిడ్ , సుధాగాలి అనే దంపతుల కుమార్తెలు రూత్ ఎవాంజెలిన్, సెలాహ్ గ్రేస్ ఆడుకోవడానికి వెళ్లి సరస్సులో పడి చనిపోయారు. By Bhavana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Karnataka: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితులపై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్ రామేశ్వరం కేఫ్ బాంబు దాడి కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులపై NIA ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ నిందితులు జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన రోజున కర్ణాటక బీజీపీ ప్రధాన కార్యాలయ వద్ద బాంబు పెట్టేందుకు ప్లాన్ వేసినట్లు పేర్కొంది. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Supreme Court: సుప్రీం కోర్టులో ఆర్జీకర్ హత్యాచార కేసు విచారణ! ఆర్జీ కర్ ఆస్పత్రి బాధితురాలి ఫొటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.ఘటనపై దర్యాప్తునకు సీబీఐకి మరో వారం రోజుల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు… వచ్చే సోమవారం నాటికి తాజా కేసు దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. By Bhavana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చింతపల్లి లో విరిగిపడ్డ కొండచరియలు..పలువురు గల్లంతు! అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో ఉన్న జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కింద ఉన్న కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన నలుగురిని గ్రామస్తులు కాపాడారు. ఈ ప్రమాదంలో మరి కొంద మంది గల్లంతైనట్లు సమాచారం. By Bhavana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn