RTC Driver:భూపాలపల్లిలో మరో విషాదం: డ్రైవర్ రవీందర్ ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించిన విషాదం మరువక ముందే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

New Update
FotoJet - 2026-04-24T132519.673

RTC driver suicide

RTC Driver: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించిన విషాదం మరువక ముందే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: కేసీఆర్ కు బిగ్ షాక్.. పార్టీ పేరు ప్రకటించిన కవిత!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రవీందర్, ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కాకపోవడం, ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. శుక్రవారం ఉదయం రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను తోటి కార్మికులు గమనించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

Also Read: ఢిల్లీలో దాడులకు ప్లాన్‌...ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

కాగా ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నలుగురు కార్మికులు ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. నర్సంపేటలో కోల శంకర్ గౌడ్ అనే కార్మికుడు నిన్న పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. నల్లగొండ డిపోకు చెందిన రావుల వెంకన్న డిపో ఎదుట డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లాలో లింగారెడ్డి  అనే కార్మికుడు సమస్యల పరిష్కారం కోరుతూ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. భూపాలపల్లిలో రవీందర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా ప్రస్తుతం వరంగల్ MGMలో చికిత్సఅందిస్తున్నారు. కార్మికుల వరుస ఆత్మహత్యలతో ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది.

Advertisment
తాజా కథనాలు