Crime News : వివాహేతర సంబంధం..ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం..ట్విస్ట్‌ ఏంటంటే?

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. ప్రియుడితో కలిసి తన సుఖానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తనే కడతేర్చాలని ప్లాన్ వేసిన ఓ భార్య ఉదంతం కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపింది.

New Update
FotoJet - 2026-04-24T071958.151

Shilpa Reddy-Nagasudheer-Vinay

 Crime News : వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. ప్రియుడితో కలిసి తన సుఖానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తనే కడతేర్చాలని ప్లాన్ వేసిన ఓ భార్య ఉదంతం కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపింది. ఈ కిరాతక పన్నాగం తాలూకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

పదహారేళ్ల క్రితం పెళ్లై, పిల్లలతో కళకళలాడాల్సిన ఆ కాపురం వివాహేతర సంబంధం వల్ల శ్మశాన వైరాగ్యానికి చేరింది. తన సుఖానికి అడ్డు పడుతున్నాడన్న కోపంతో భర్తను చంపేందుకు ఓ భార్య ఏకంగా 14 తులాల బంగారాన్ని సుపారీగా ఇచ్చి కిరాయి ముఠాను రంగంలోకి దించింది. ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి, శిల్పారెడ్డి దంపతులు. వీరి వివాహం జరిగి 15 ఏళ్లు అవుతోంది. అయితే, జిల్లా ఆసుపత్రిలో పనిచేసే జమ్మలమడుగుకు చెందిన దాసరిగాళ్ల నాగసుధీర్‌తో శిల్పారెడ్డికి ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఈశ్వర్‌రెడ్డి ఆమెను పలుమార్లు మందలించారు. దీంతో భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్రియుడితో కలిసి నిర్ణయించుకుంది.

 భర్తను చంపేందుకు నాగసుధీర్‌ ద్వారా రాజుపాళెంకు చెందిన రౌడీషీటర్ వినయ్‌ను సంప్రదించారు. అతని సహాయంతో హిందూపురానికి చెందిన ఓ కిరాయి ముఠాతో రూ. 10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. సుపారీ నగదు కోసం శిల్పారెడ్డి తన ఇంట్లోని 14 తులాల బంగారాన్ని ప్రియుడికి అప్పగించింది. ఆ బంగారాన్ని ప్రొద్దుటూరు, జమ్మలమడుగులోని దుకాణాల్లో కుదువ పెట్టిన నాగసుధీర్.. కిరాయి ముఠాకు అడ్వాన్స్‌గా రూ. 5 లక్షలు చెల్లించాడు. బుధవారం పథకం ప్రకారం ఈశ్వర్‌రెడ్డి కదలికలను శిల్పారెడ్డి ఎప్పటికప్పుడు ప్రియుడికి చేరవేసింది. ఈశ్వర్‌రెడ్డి బైక్‌పై వెళ్తుండగా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో కారుతో బలంగా ఢీకొట్టి, అనంతరం కత్తులతో దాడి చేసి చంపాలని ముఠా ప్రయత్నించింది. ఒకవేళ అక్కడ మిస్ అయితే పొలం వద్ద కత్తులతో నరికి చంపాలని రెండో ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు.

అదృష్టవశాత్తూ కారు ఢీకొట్టిన ప్రమాదం నుండి ఈశ్వర్‌రెడ్డి తేరుకుని, నిందితుల దాడి నుంచి తప్పించుకుని నేరుగా పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారించగా, ఈ కుట్ర వెనుక భార్య శిల్పారెడ్డి, ఆమె ప్రియుడు నాగసుధీర్ ఉన్నట్లు గుర్తించారు.: పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, ప్రధాన నిందితులతో పాటు కిరాయి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు