Thandel Censor Report: అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) కాంబోలో రిలీజ్ కానున్న చిత్రం తండేల్ (Thandel). డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ వాసు(Bunny Vasu) ఈ చిత్రాన్ని అల్లు అరవింద్(Allu Arvind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్(Geetha Arts Banner)పై నిర్మిస్తున్నారు. అయితే మూవీ టీం ఇటీవల ట్రైలర్(Thandel Trailer)ను వైజాగ్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ చేసింది.
ఇది కూడా చూడండి: USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి
#Thandel Censored With U/A & Official Announcement Soon ! @chay_akkineni
— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 30, 2025
Censor report With BLOCKBUSTER TALK pic.twitter.com/bLOapp6L4A
ఇది కూడా చూడండి: Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!
సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు
ట్రైలర్ అదిరిపోయిందని, తప్పకుండా సినిమా హిట్ అవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే రిలీజ్‌కి దగ్గర పడుతున్న తండేల్ సినిమా సెన్సార్ పూర్తి అయ్యినట్లు తెలుస్తోంది. మొత్తం సినిమా రన్ టైం 2 గంటల 32 నిమిషాలు. మొదటి నుంచి చివరి వరకు సినిమా బాగుందని, సెన్సార్ సభ్యులు కూడా సినిమాకి ఫ్లాట్ అయ్యారట. ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!
లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ మూవీ తరువాత మరోసారి వీళ్లిద్దరి కాంబో రిపీట్ కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈసారి సినిమా పక్కా హిట్ అని నెటిజన్లు అంటున్నారు. మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా రూపొందిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇది కూడా చూడండి: Maha Kumbh mela: వీవీఐపీల పాస్ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!