ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
AP: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల శక్తి శాఖ తొలిసారిగా అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
AP: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల శక్తి శాఖ తొలిసారిగా అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దేవాలయాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
AP: రాష్ట్ర రాజకీయాల్లో నేతల న్యూడ్ వీడియో కాల్స్ లీక్ అవ్వడం కలకలం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ న్యూడ్ వీడియో లీక్ అయింది. ప్రైవేట్ పార్టులు చూపిస్తూ ఉన్న వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో తిరుపతి లడ్డూ వివాదం, ఎన్నికల ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర రాసలీలల బాగోతం బయటపడింది. జనసేన నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన మహిళతో మాట్లాడిన వాట్సప్ వీడియో కాల్ వైరల్ అవుతోంది. 'రేపు కలుద్దాం. పోయినసారిలాగే చేద్దాం. మందు తాగుదాం' అనే సంభాషణ ఇందులో చూడొచ్చు.
AP: మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులతో బ్యాంకులు పనిచేయవని దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ నెల 11 వరకు దరఖాస్తులకు సమయాన్ని పొడిగించింది.
AP: అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
AP: మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈరోజు పెద్ద ప్రకటన చేయనున్నట్లు తన ట్విట్టర్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.