చంద్రబాబు స్కిల్ కేసులో ఈడీ దూకుడు.. భారీగా ఆస్తులు అటాచ్! గతంలో చంద్రబాబు అరెస్టుకు కారణమైన స్కిల్ కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ కేసులో ఈడీ రూ.23 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. దీంతో ఈడీ నెక్ట్స్ ఏం చేయబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. By Nikhil 15 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Skill Development Case: స్కిల్ డవలప్మెంట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి రూ.23 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబై ,పూణేలలోని సిమెన్స్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది. గత జగన్ సర్కార్ హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. నకిలీ ఇన్ వాయిస్ ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. Also Read: హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి..విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా..! ED, Hyderabad has provisionally attached immovable and movable properties amounting to Rs. 23.54 Crore under the provisions of the PMLA, 2002 in a case relating to misuse of funds in the Andhra Pradesh State Skill Development Corporation (APSSDC) Siemens Project. The said project… — ED (@dir_ed) October 15, 2024 డిజైన్ టెక్ సంస్థ ఎండీ ఖాన్వేల్కర్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, ఇంకా వారి సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ తదితరులు ఫేక్ ఇన్ వాయిస్ లు సృష్టించినట్లు ఈడీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.. తద్వారా ప్రభుత్వ డబ్బులను తమ షెల్ కంపెనీలలోకి వీరు మళ్లించినట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే వీరి స్థిరచరాస్తులు అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి గత జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. దీంతో ఆయన 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉండి బెయిల్ పై విడుదలయ్యారు. Also Read: మద్యం షాపులకు లాటరీ.. ఎన్నో చిత్ర విచిత్రాలు బాబోయ్, ఆశ్చర్యపోతారు! స్కిల్ డెవలప్ మెంట్ లో సిమన్స్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ED కన్ఫర్మ్ చేసుకుందికనకే 23 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ప్రధాన ముద్దాయి @ncbn.ఈ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే @ysjagan గారిపై, క్యాంప్ ఆఫీస్ గురించి అవాకులు చెవాకులూ మాట్లాడుతున్నారు.-పుత్తా శివ… https://t.co/ykiCB1B0wL pic.twitter.com/gm9kIcYdkw — YSR Congress Party (@YSRCParty) October 15, 2024 Also Read: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే! చంద్రబాబే నిందితుడు: వైసీపీ ఈ విషయంపై వైసీపీ రియాక్ట్ అయ్యింది. స్కిల్ డెవలప్ మెంట్ లో సిమన్స్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శంకర్ రెడ్డి అన్నారు. ED కన్ఫర్మ్ చేసుకుంది కాబట్టే 23 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిందన్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి ప్రస్తుత సీఎం చంద్రబాబేనని ఆరోపించారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే జగన్ పై అవాకులు చెవాకులూ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. Also Read: ఏపీలో ఆ నగర వాసులకు కేంద్రం గుడ్‌న్యూస్.. సీఎం కృతజ్ఞతలు #chandrababu-naidu #ed #skill-scam-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి