టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి.. దీని వెనుక సజ్జల హస్తం ఉందా? సీఎం చంద్రబాబు నివాసం, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపైన దాడి కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. అయితే ఈ దాడి వెనుక గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి హస్తం ఉందని, సీఐడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. By Kusuma 14 Oct 2024 in రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపైన, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపైన దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి కేసులను సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే విచారణ వేగవంతం చేయాలని, ఈ రోజు మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ ఫైల్ అప్పగించనున్నట్లు సమాచారం. అయితే ఈ దాడుల వెనుక గత ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చూడండి: ప్రాణం తీసిన బెట్టింగ్.. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు విచారణకు సహకరించలేదని.. సజ్జల సహకారంతోనే దాడులు చేశారని, అతన్ని కూడా సీఐడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేశ్‌ను అరెస్టు చేశారు. అతను జైలుకి వెళ్లిన మళ్లీ బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ కేసులో మాజా మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు ఎన్నోసార్లు విచారణకు పిలిచారు. కానీ అతను సహకరించలేదని, సీఐడీకి అప్పగిస్తే తొందరగా విచారణ అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా చూడండి: దేవర ఫేక్ కలెక్షన్లపై నిర్మాత క్లారిటీ.. ఫ్యాన్స్ ఆనందం కోసమే అలా..! ఇదిలా ఉంటే మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కొందరు దాడి చేశారు. ఈ కేసులో కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్‌తో పాటు 14 మంది నిందితులుగా ఉన్నారు. గత ప్రభుత్వం ఉన్న సమయంలో.. అధికారం వారి చేతిలో ఉందని వాళ్లకి నచ్చినట్లుగా రెచ్చిపోయారు. కేవలం టీడీపీ కేంద్ర కార్యాలయంపై మాత్రమే దాడికి పాల్పడకుండా ఆ ప్రాంతాల్లో కూడా బీభత్సం సృష్టించారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందస్తు బెయిల్ కోసం వీరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇది కూడా చూడండి: Andhra Pradesh: ఏపీలో నేడు మద్యం దుకాణాలు కేటాయింపులు! ముందస్తు బెయిల్ ఇవ్వడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగిరమేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జోగిరమేశ్ విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా సుప్రీం స్పష్టం చేసింది. పాస్‌పోర్టు సరెండర్ చేయడంతో పాటు దర్యాప్తుకు సహకరించాలని, ఒకవేళ అలా చేయకపోతే రక్షణ ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది కూడా చూడండి: మోడల్ టూ ఐపీఎస్.. ఆష్నా చౌదరి ఇంట్రెస్టింగ్ సక్సెస్ స్టోరీ! #chandrabbau మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి