AP News: తెనాలిలో రతన్ టాటాకు అరుదైన గౌరవం

గుంటూరు జిల్లా తెనాలి కాటూరి శిల్పశాలలో రతన్ టాటా విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తిని, రతన్ టాటా విగ్రహం ఆవిష్కరించటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

New Update
Ratan Tata statue unveiling

Minister Nadendla Manohar

AP News: గుంటూరు జిల్లా తెనాలి కాటూరి శిల్పశాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ.. ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తి రతన్ టాటా అన్నారు. సమాజ సేవతో రతన్ టాటా ముందు ఉండేవారు, రతన్ టాటా ఎన్నో సంస్థలు స్థాపించారన్నారు. క్వాలిటీ ప్రొడక్ట్ అంటే టాటానే.. రతన్ టాటా ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారని, అనేక గొప్ప కార్యక్రమాలు చేశారని మంత్రి గుర్తు చేశారు. రతన్ టాటా విగ్రహ ఆవిష్కరణతో తెనాలి ప్రత్యేకత మరొకసారి చాటిచెప్పారు. రతన్ టాటాను స్ఫూర్తిగా నింపుకొని ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. 

ఇది కూడా చదవండి:  కుటుంబమంతా స్నానానికి ఒకే సబ్బు వాడుతున్నారా?..అయితే జాగ్రత్త

రతన్ టాటా స్ఫూర్తితో..

డబ్బులు సంపాదించడమే కాదు వాటిని విరాళాలు రూపంలో ఇవ్వటం టాటాని చూసి నేర్చుకోవాలన్నారు. టాటా ఇచ్చినన్ని విరాళాలు ప్రపంచంలోనే ఎవ్వరు ఇచ్చి ఉండరు. టాటా గొప్ప దాతగా నిలబడ్డారు. టాటా విగ్రహం ఆవిష్కరించటం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు.  అమరావతిలో రతన్ టాటా స్ఫూర్తితో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చెయ్యటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారని మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి:  తిరుపతి భక్తులకు అలర్ట్.. ఆ మార్గం మూసివేత

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment