చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

AP: వివిధ రంగాలకు సంబంధించిన కొత్త విధానాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నూతన ఇసుక పాలసీ, మద్యం విధానాలను ప్రకటించిన ప్రభుత్వం మరో 22 కొత్త పాలసీలను త్వరలోతీసుకొచ్చేలా కార్యాచరణ చేపట్టింది.

New Update
CHANDRABABU

AP Government: వివిధ రంగాలకు సంబంధించిన కొత్త విధానాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నూతన ఇసుక పాలసీ, మద్యం విధానాలను ప్రకటించిన ప్రభుత్వం మరో 22 కొత్త పాలసీలను త్వరలోతీసుకొచ్చేలా కార్యాచరణ చేపట్టింది. ఇంధన రంగానికి సంబంధించిన విధాన రూపకల్పన దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై చంద్రబాబు ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. దీనిని వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పర్యాటక, పారిశ్రామిక, ఐటీ వంటి రంగాలకు సంబందించిన కొత్త విధానాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. 

తీసుకురానున్న పాలసీలు ఇవీ..! 

1. ఇందన రంగం 
2. ఉన్నత విద్య 
3. బ్లూ ఓషన్ ఎకానమీ 
4. మారి టైమ్ 
5. టెక్స్టైల్ 
6. 500 కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెడుతూ నూతన పారిశ్రామిక విధానం 
7. పారిశ్రామిక పార్కులు 
8. ఫుడ్ ప్రాసె సింగ్ 
9. ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రైన్యూర్షిప్ 
10. లాజిస్టిక్స్ 
11.సెమికం డక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ 
12.స్టార్టప్ 
13.హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ 
14. ఐటీ 
15. ఆర్ అండ్ డి అండ్ డీల్టెక్ 
16. పీ4 అండ్ హెచ్ఎన్ఏ 
17. రహదారు లకు సంబంధించి పీపీపీ విధానం 
18.వాటర్ పాలసీ 
19.పర్యాటక 
20. యువత 
21.క్రీడలు 
22.ఇ-స్పోర్ పాలసీ

Advertisment
Advertisment
తాజా కథనాలు