ఏపీలో ఆ నగర వాసులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. సీఎం కృతజ్ఞతలు

రాష్ట్రంలోని గుంటూరు వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలోని శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కేంద్రం రూ.98కోట్ల నిధులు కేటాయించింది. నిధులు మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

New Update
chandrababu

కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా ఓ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.498 కోట్లు, తెలంగాణకు రూ.516 కోట్ల నిధులు రిలీజ్ చేసింది. అయితే ఇవి మాత్రమే కాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇది కూడా చదవండి: అపోహలొద్దు.. అన్యాయం జరగదు: వారికి సీఎం రేవంత్ భరోసా!

భారీ వర్షాలు, వరదల కారణంగా ఎన్నో లోతట్టు ప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయి. ఎన్నో ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రజలు నానా అవస్థలు పడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు  ఎన్‌డిఆర్ఎఫ్ నిధులు విడుదల చేసింది. ఇక ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిధులు రిలీజ్ చేసింది. 

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

రూ.98 కోట్ల నిధులు విడుదల

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు (Guntur) నగర వాసులకు సైతం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఈ నగంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ (Shankar Vilas Flyover) చాలా రద్దీగా ఇరుకుగా ఉండటంతో ఎక్కువగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల ఆ ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.98 కోట్లు నిధులు కేటాయించింది. 

ఇది కూడా చదవండి: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు!

ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా పోస్టు పెట్టారు. కాగా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఫ్లైఓవర్ నిర్మిస్తామని ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ లోక్‌సభ అభ్యర్థి, ప్రస్తుత కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట ఇచ్చారు.

ఇది కూడా చదవండి: ఎంబీబీఎస్ అడ్మిషన్ వివాదం .. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఆ మాట ప్రకారం.. పెమ్మసాని చొరవతో కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయి. గుంటూరులో ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై నితిన్ గడ్కరీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సీఆర్‌ఐఎఫ్‌ పథకం కింద 13 రాష్ట్ర రహదారులకు రూ.400 కోట్లు మంజూరయ్యాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. అదనంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి CRIF సేతు బంధన్ చొరవ కింద శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.98 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు