World Population: 2100 నాటికి ప్రపంచ జనాభా తగ్గనుందా? ఐక్యరాజ్యసమితి ఏం చెబుతోంది? ప్రపంచంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. మఖ్యంగా భారత్, చైనాలాంటి దేశాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంది ఈ ప్రమాదం. దీని మీద ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి మాత్రం ఏం వర్రీ అవ్వక్కర్లేదు అని చెబుతోంది. భవిష్యత్తులో జనాభా తగ్గుతుందని అంటోంది. By Manogna alamuru 09 Nov 2023 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి World Population in 2100: భవిష్యత్తు ఎలా ఉంటుందో మన ఊహకు అందదు. మనం అనుకున్న వాటికి వ్యతిరేకంగా కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా అలాంటిదే. ప్రస్తుతం ప్రపంచంలో జనాభా పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఇది అనర్ధాలకు దారి తీస్తోందన ఇపర్యావరణ సంస్థలు, ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి కూడా. అయితే ఐక్యరాజ్యసమితి (United Nations) మాత్రం జనాబా పెరుగుదల గురించి అస్సలు వర్రీ అవ్వకండి అని చెబుతోంది. 2100నాటికి జనాభాలో తగ్గుతుందని అంటోంది. ఐక్యరాజ్యసమితి అందించిన ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ (World Population Prospects) డేటాలోని ఈ వివరాలను వెల్లడించింది. Also read:నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోస్టల్ జాబ్‌లకు నోటిఫికేషన్ రిలీజ్ ఈ డేటాలో భారత్ తో పాటూ పాకిస్తాన్, చైనా, అమెరికా, యూరోపియన్ కంట్రీల జనాభాకు సంబంధించిన వివరాలున్నాయి. దీని ప్రకారం ప్రస్తుం భారత జనాభా 140 కోట్లు ఉంది. అంతకు ముందు 2021లో మన దేశ జనాభా (India Population) 153 కోట్లు. అంటే అప్పటికీ ఇప్పటికీ 13కోట్ల మంది తగ్గారు. దీనిబట్టి చూస్తే వచ్చే 77 ఏళ్ళల్లో అంటే 2100నాటికి జనాబా మరింత తగ్గుతుందని అంటోంది. చైనా గురించి అయితే మరింత షాకింగ్ విషయాలు చెబుతోంది రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022 నివేదిక. 2100 నాటికి చైనా జనాభా 140 కోట్ల నుంచి దాదాపు 77 కోట్లకు తగ్గిపోనుంది. ఐక్యరాజ్యసమితి యూఎన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఈ), ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ (ఐఐఏఎస్‌ఏ)లు అందించిన డేటాలలోని అంశాలను క్రోడీకరించి 2100నాటి జనాభా అంచనాలను రూపొందించారు. ఇందులో ప్రపంచ జనాభా 2086 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ...కానీ సంతానోత్పత్తి రేట్లు 2050 కన్నా ముందుగానే త్వరితగతిన తగ్గుతాయని అంచనా. 2100కి వీటి స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. జనాభా తగ్గడానికి కారణాలను కూడా ఇందులో విశ్లేషించారు. మహిళలు ఉద్యోగాల్లో ఎక్కువగా పనిచేయడం, కుటుంబ నియంత్రణ మీద అవగాహన, గర్భనిరోధకాలు ఎక్కువగా లభించడం, జీవన ప్రమాణాలు పెరగడం వంటివి సంతానోత్పత్తి తగ్గుదలకు తోడ్పడతాయని చెబుతున్నారు. 2100 నాటికి ఏ దేశంలో ఎంత జనాభా(అంచనా)? భారతదేశం: 153 కోట్లు చైనా: 77 కోట్ల 10 లక్షలు నైజీరియా: 54 కోట్ల 60 లక్షలు పాకిస్తాన్: 48 కోట్ల 70 లక్షలు కాంగో: 43 కోట్ల 10 లక్షలు అమెరికా: 39 కోట్ల 40 లక్షలు ఇథియోపియా: 32 కోట్ల 30 లక్షలు ఇండోనేషియా: 29 కోట్ల 70 లక్షలు టాంజానియా: 24 కోట్ల 40 లక్షలు ఈజిప్ట్: 20 కోట్ల 50 లక్షలు బ్రెజిల్: 18 కోట్ల 50 లక్షలు ఫిలిప్పీన్స్: 18 కోట్లు బంగ్లాదేశ్: 17 కోట్ల 70 లక్షలు సూడాన్: 14 కోట్ల 20 లక్షలు అంగోలా: 13 కోట్ల 30 లక్షలు ఉగాండా: 13 కోట్ల 20 లక్షలు మెక్సికో: 11 కోట్ల 60 లక్షలు కెన్యా: 11 కోట్ల 30 లక్షలు రష్యా: 11 కోట్ల 20 లక్షలు ఇరాక్: 11 కోట్ల 10 లక్షలు ఆఫ్ఘనిస్తాన్: 11 కోట్లు మొజాంబిక్: 10 కోట్ల 60 లక్షలు వియత్నాం: 9 కోట్ల 10 లక్షలు కామెరూన్: 8 కోట్ల 70 లక్షలు మాలి: 8 కోట్ల 70 లక్షలు మడగాస్కర్: 8 కోట్ల 30 లక్షలు టర్కీ: 8 కోట్ల 20 లక్షలు ఇరాన్: 7 కోట్ల 90 లక్షలు దక్షిణాఫ్రికా: 7 కోట్ల 40 లక్షలు యెమెన్: 7 కోట్ల 40 లక్షలు జపాన్: 7 కోట్ల 40 లక్షలు #china #india #un #world-population-in-2100 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి