Vijayawada : బుడమేరుకు ఏ క్షణమైనా వరద!
భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.
భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్రలోని విశాఖ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే, కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వివరించారు.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్,కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కారులో ప్రయాణిస్తున్న ఓ జంట వరదలో చిక్కుకపోయింది. దీంతో వాళ్లు ఆ కారు పైభాగానికి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. చివరికి సహాయక బృందాలు అక్కడికి చేరుకుని ఆ జంటను రక్షించాయి.
ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్థానిక ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
ఏపీలో ఘోర ప్రమాదం తప్పింది. 50 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోర్నగూడెం దగ్గర ఐరన్ బ్రిడ్జిని ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణనష్టం లేకపోగా పలువురు గాయపడ్డారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లితోపాటు పలు ప్రాంతాలు జలయమం అయ్యాయి. మరో 2 గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వానకు తడుస్తూనే గణపతికి పూజలు చేస్తున్నారు భక్తులు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
AP: విజయవాడలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.