తమిళనాడుకు భారీ వర్ష సూచన.. ఈ తేదీల్లో అప్రమత్తత తప్పనిసరి!

తమిళనాడులోని మధురైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు దత్తనేరి, పాలగంఠాలు నీట మునిగాయి. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

New Update

తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నై, మధురైతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధురైని వరద ముంచెత్తుతుంది. గడిచిన 24 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మధురై ఆలయం చుట్టుపక్కలతో పాటు దత్తనేరి, పాలగంఠాలు నీట మునిగాయి. వాహనాలు కూడా వరదలో పూర్తిగా మునిగిపోయాయి. 

ఇది కూడా చూడండి: బాబా సిద్ధిఖీ హత్యకు కారణం.. సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత్యమేనా?

ఈ తేదీల్లో జాగ్రత్త..

తిరుపరంగుంరం గరుడన్ ఫుట్ బ్రిడ్జి, రైల్వే ఫుట్ బ్రిడ్జి భారీగా వరద నీరుతో మునిగింది. రాబోయే ఐదు రోజుల పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తమిళనాడులో పుదుచ్చేరి, కారైకల్‌లో 14 నుంచి 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తేదీల్లో ప్రజలు అప్రమత్తతగా ఉండాలని అధికారులు సూచించారు. 

ఇది కూడా చూడండి: SiddiKhi:షారుఖ్ -సల్మాన్ మధ్య గొడవను సాల్వ్ చేసిన బాబా సిద్ధిఖీ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు