వాతావరణ పరిస్థితులను పక్కాగా అంచనా వేసే సూపర్‌ కంప్యూటర్లు..

వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితత్వంతో పసిగట్టే సాంకేతికత రానుంది. ప్రస్తుతం వాడుతున్న సూపర్‌ కంప్యూటర్ల సామర్థ్యాన్ని 6.8 పెటాఫ్లాప్స్‌ నుంచి 22 పెటాఫ్లాప్స్‌కు పెంచారు. అరుణిక, అర్కా అనే సూపర్‌ కంప్యూటర్లను ప్రధాని మోదీ త్వరలోనే ప్రారంభించనున్నారు.

New Update
Arka

వాతావరణ పరిస్థితులను అంచనా వేసే సాంకేతికతను దాదాపు అన్ని దేశాలు వాడుతున్నాయి. మన దేశంలో కూడా భారత వాతావరణ శాఖ ఏ చోట వర్షాలు పడతాయో, తుపానులు వస్తాయో ముందుగానే అంచనా వేస్తాయి. కానీ ఈ అంచనాలు కొన్నిసార్లు నిజమవుతాయి. మరికొన్నిసార్లు కావు. వర్ష ప్రభావ తీవ్రతను కూడా వాతావరణ శాఖ చాలాసార్లు సరిగ్గా పసిగట్టలేవు. దీనివల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రదేశాల్లోకి తరలించలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలా కచ్చితమైన వాతావరణ అంచనాలు లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.

Also Read: Paracetamol - PAN D టాబ్లెట్స్ వేసుకునే వారికి బిగ్ షాక్.. !

 ఈ నేపథ్యంలోనే వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితత్వంతో పసిగట్టే సాంకేతిక రానుంది. దీనివల్ల ఎక్కడ, ఎంత వాన పడుతుందో గంటల ముందుగానే పక్కగా గుర్తించవచ్చు. ప్రస్తుత వాతావరణ మోడల్స్‌ను విశ్లేషించేందుకు సూపర్‌ కంప్యూటర్‌ల సామర్థ్యాన్ని భారత్‌ మరో మూడు రేట్లు పెంచింది. పూణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యట్‌ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ (IITM)లో, నోయిడాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ (NCMRWF)లో వాతావరణ పరిశీలనలకు వాడుతున్న సూపర్‌ కంప్యూటర్ల సామర్థ్యం 6.8 పెటాఫ్లాప్స్‌గా ఉంది. ఇప్పుడు రూ.850 కోట్ల వ్యయంతో ఈ రెండింటి సామార్థ్యాన్ని ఏకంగా 22 పెటాఫ్లాప్స్‌కు పెంచారు. అరుణిక, అర్కా అనే ఈ రెండు సూపర్‌ కంప్యూటర్లను ప్రధాని మోదీ పూణెలో గురువారం ప్రారంభించాల్సి ఉంది. అయితే అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇది వాయిదా పడింది.  

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్‌ కంప్యూటర్లు 12 కిలోమీటర్ల గ్రిడ్‌ పరిమాణంతో మాత్రమే శాటిలైట్‌ చిత్రాలను విశ్లేషించగలవు. అందుకే అప్పటికప్పుడు మారిపోయే వాతవరణ పరిస్థితుల్ని కచ్చితంగా అంచనా వేయడంలో పొరపాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ గ్రిడ్‌ పరిమాణాన్ని 6 కిలోమీటర్లు తగ్గించగలిగితే ఎక్కడ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందో కచ్చితత్వంతో చెప్పే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ సూపర్‌ కంప్యూటర్ల సామార్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 6.8 పెటాఫ్లాప్స్‌ నుంచి 22 పెటాఫ్లాప్స్‌కు పెంచితే ఇది సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు వాటి సామర్థ్యాన్ని పెంచారు.

Also Read: పెన్షన్ కోసం 2 కి.మీ మోకాళ్లపై.. వృద్ధురాలు!

పూణెలోని హెచ్‌పీసీ, ఐఐటీఎం ప్రాజెక్టు డైరెక్టర్ సూర్య చంద్రరావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) వ్యవస్థను ప్రారంభించిన తర్వాత రెండు నెలల్లో ఇది పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి వస్తుంది. పూణెలోని సూపర్‌ కంప్యూటర్‌ (అర్కా) వాతవరణ మోడల్స్‌ను మాత్రమే కాదు.. వాతావరణ మార్పులపై కూడా పనిచేస్తుంది. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI), మెషిన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలను ఉపయోగించుకునేలా దీన్ని అభివృద్ధి చేశారు. వాతావరణ సూచనలు, మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెరుగుతున్న అసాధరణ వాతావరణ పరిస్థితుల గురించి ముందుగానే పక్కాగా హెచ్చరికలు ఇచ్చే అవకాశాలున్నాయని'' సూర్య చంద్రరావు తెలిపారు.  

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pak-India: మాటమార్చిన పాక్ ప్రధాని...దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన కశ్మీర్‌ సీఎం!

పహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి తాము సిద్దమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.ఈ ప్రకటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు.

New Update
omar abdullah

omar abdullah

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని దాయాది పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, అంతలోనే ఆ దేశం మాట మార్చింది. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి తాము సిద్దమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ ప్రకటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. 

Also Read:TTD: వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలతో తిరుమల వెళ్తున్నారా.. అయితే మీకో చేదువార్త!

ముందు ఈ ఘటనను తోసిపుచ్చిన పాకిస్థాన్ .. భారత్‌పై నిందలు వేసిందని విమర్శించారు.. ఇప్పుడు దర్యాప్తునకు సిద్ధమనడం విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని పాక్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

Also Read: India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

ఉగ్రదాడిపై నిష్పక్షపాత విచారణకు తాము సిద్ధమని పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ దాడిని పాకిస్తాన్ ఖండించిందని, భారత్‌పై నిందలు వేసిందని ఆయన గుర్తు చేశారు. పహల్గామ్‌లో జరిగిన దాడిని పాక్ గుర్తించలేదని ఒమర్  అన్నారు. మొదట ఈ దాడి వెనుక భారత్ ఉందని ఆరోపించారని ఆయన విమర్శించారు. మనపై ఆరోపణలు చేయడంలో ముందుండే వారికి ఇప్పుడేమీ చెప్పలేమని ఒమర్ అబ్దుల్లా అన్నారు. 

వారి ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ‘దురదృష్టకరమైన ఆ ఘటన జరిగి ఉండాల్సింది కాదు’ అని ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ‘జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘటనతో తమ దేశంపై నిందలు వస్తున్నాయి’ అని అన్నారు. 

‘విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం" అని షరీఫ్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అన్నారు.

అమెరికా ప్రతిపాదనపై ఏకాభిప్రాయం రావడానికి ముందు అనేక చర్చలు జరిగాయి. పాకస్థాన్, చైనాతో కలిసి ప్రకటనలోని పదాలను మార్చడానికి ప్రయత్నించింది. గతంలో పుల్వామా, జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు దాడి వంటి ఉగ్రదాడులను మండలి ఖండించింది. స్థానిక ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. కానీ, ఐరాస ప్రకటనలో భారత ప్రభుత్వ ప్రస్తావన ఉంటే తమకు ఇబ్బంది తప్పదని పాక్ అనుకుంది.

ఈ క్రమంలో పాక్ ప్రధాని దర్యాప్తునకు సిద్ధమని ప్రకటన చేసినట్టు సమాచారం. ఇక, సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నట్లు తెలుస్తుంది. దాయాది కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొడుతోంది.

Also Read: Pak: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్‌ సైన్యాధిపతి!

Also Read: Russia-Ukrain-Putin: ఉక్రెయిన్‌ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!

pakistan | india | jammu-kashmir | cm | Omar Abdullah | pahalgam | attack in Pahalgam | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment