బంగాళాఖాతంలో మరో అల్పపీడనం...రెండు రాష్ట్రాల్లో వారం పాటు వానలే..!

బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Rains : బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడింది. దీని  ప్రభావం వల్ల పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని, థాయ్ లాండ్ కు ఉత్తరం వైపున మరో సర్క్యులేషన్ ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు సర్క్యులేషన్లు అల్పపీడనానికి దారితీస్తాయని అంచనా వేసింది.

దీని ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఏపీలో 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, తెలంగాణలో 24,25న రాయలసీమలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

 తెలుగు రాష్ట్రాలు మేఘావృతం అయి ఉంటాయని అధికారులు వివరించారు. వారం పాటు సాయంత్రం 5 గంటల తర్వాత రెండు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు