/rtv/media/media_files/2025/03/15/eZjG2nOlfC29AXU9wlfS.jpg)
VC Sajjanar Photograph: (VC Sajjanar )
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. సినీ, క్రికెట్ సెలబ్రిటీలు, యూట్యూబర్లు ప్రమోట్ చేసిన యాప్స్ నమ్మి చాలా మంది అమాయక యువత మోసపోతున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చలేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో.. మేడ్చల్ జిల్లాకు చెందిన సోమేష్ అనే యువకుడు బెట్టింగ్ యాప్స్‌లో రూ. 2 లక్షలు పోగొట్టుకుని.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక, తనలో తానే మదనపడి.. చివరికి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రైలు కిందపడి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.
Also Read: Mohul Choksi: ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!
అయితే.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై గట్టిగా ఫోకస్ చేసిన టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. ప్రమోటర్స్ ఎంతటివారైనా కటకటాల్లోకి పంపించటమే పనిగా పెట్టుకోవటే కాకుండా.. ఆ బెట్టింగ్ మాయలో పడకుండా అమాయక ప్రజలకు అవగాహన కల్పించే పని కూడా ఆయనే స్వయంగా తీసుకున్నారు. ఇప్పటికే ఈ బెట్టింగ్ మాయలో పడి చాలా మంది యువత ప్రాణాలు కోల్పోయారంటూ ప్రతిసారి తన బాధను వ్యక్తం చేస్తున్న సజ్జనార్ తాజాగా సోమేష్ ఆత్మహత్య చేసుకోవటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టారు.
Also Read: Trump-Musk:ఎలాన్ మస్క్ గొప్ప దేశభక్తుడు: ట్రంప్
Sajjanar Emotional Post On Betting Apps
సమస్య ఏదైనా సరే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు!! ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి వ్యసనపరులే బలవన్మరణాలను పాల్పడకండి.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 25, 2025
ఆలోచించండి.. మీరు క్షణికావేషంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో. సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో… pic.twitter.com/r1svQ6hbiW
జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా.. నిలబడి ఎదుర్కోవాలని.. ఆత్మహత్య అనేది ఎప్పటికీ పరిష్కారం కాదంటూ.. సజ్జనార్ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "సమస్య ఏదైనా సరే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు!! ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి వ్యసనపరులే బలవన్మరణాలను పాల్పడకండి. ఆలోచించండి.. మీరు క్షణికావేషంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో. సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో అన్వేషించాలే తప్పా.. చనిపోవాలనే ఆలోచనే ఎప్పటికీ రాకూడదు.
ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించిన అందులోనే. జీవన ప్రయాణంలో ఒక్కసారి కిందపడితే.. సర్వం కోల్పోయినట్లు కాదు కదా. అమూల్యమైనా జీవితాన్ని అర్దాంతరంగా కాలదన్నుకోవద్దు. చీకటి వెలుగులా నిత్యం కష్టసుఖాలు అందర్నీ వెంటాడుతూనే ఉంటాయి. కష్టకాలంలో బాధలను ఇతరులతో పంచుకోవాలి. పరిష్కార మార్గాలు వెతకాలి. ఎంత కష్టం వచ్చినా ఎల్లకాలం ఉంటుందా? చనిపోయినంతా మాత్రాన సమస్యలు టక్కున మాయమవుతాయా..!? బలవన్మరణం వద్దు.. బతికి సాధించడమే ముద్దు." అంటూ యువతలో స్పూర్తి నింపడానికి సజ్జనార్ ప్రయత్నించారు.
Also Read: Modi-Trump: టారిఫ్‌లు తగ్గించేందుకు మోదీ సర్కార్ చర్యలు..ట్రంప్ ఎఫెక్టేనా!
tgrtc | md-sajjanar | rtc md sajjanar | betting-apps | betting apps case | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates