/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-16-7.jpg)
AI center in Hyderabad
Hyderabad: మైక్రోసాఫ్ట్(Microsoft)తో తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో AI సెంటర్(Hyderabad AI Center) ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఇందులో భాగంగానే నూతన మైక్రోసాఫ్ట్ భవనాన్ని గురువారం ప్రారంభించిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని, మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
500 ప్రభుత్వ పాఠశాలల్లో AI సేవలు..
ఈ మేరకు మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. మైక్రోసాఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీతో కూడిన ADVANTA(I) GE TELANGANA ను ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భాగస్వామ్యంతో తెలంగాణ, మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!
ఈ పెట్టుబడి మా స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం చేయడంతోపాటు మెంటార్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్వర్క్ యాక్సెస్ ను ఇస్తుంది. మా ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందని గర్వంగా చెబుతున్నా. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్ షిప్ టీమ్ కు ధన్యవాదాలు. ఆవిష్కరణల పట్ల మీ నిబద్ధత మా తెలంగాణ రైజింగ్ విజన్ కు తోడవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Kerala: కేరళ నర్సింగ్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
ఇది కూడా చదవండి: ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు