/rtv/media/media_files/2025/03/24/ovC36m0urRNFIwXQH8aR.jpg)
Telangana Cabinet Expansion
తెలంగాణలో కేబినెట్ విస్తరణ అనేది గతకొంతకాలంగా వాయిదా పడుతూనే ఉంది. మొత్తానికి ఆ సమయం వచ్చింది. రేవంత్ సర్కార్ కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతోంది. ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలకు కేబినెట్ స్థానం కల్పించే యోచనలో అదిష్ఠానం ఉన్నట్లు సమాచారం. రెడ్డి లేదా రావు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read: బండి సంజయ్ పై క్రిమినల్ కేసు!'
Telangana Cabinet Expansion On Ugadi
బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, బీర్ల ఐలయ్య, విజయశాంతి ఉన్నారు. రెడ్డి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు ఉన్నారు. ఎస్సీల నుంచి వివేక్, అద్దంకి దయాకర్ రేసులో ఉన్నారు. ఇక ఎస్టీల నుంచి రేసులో బాలు నాయక్, రాంచందర్ నాయక్ ఉండగా.. మైనార్టీల నుంచి కొత్తవారికి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో 11 మందిని తన కేబినెట్‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా కేబినెట్‌లో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ వస్తోంది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటిదాక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చివరికీ ఇప్పుడు కేబినెట్ విస్తరణకు హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు!
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కేబినెట్ విస్తరణపై చర్చించేందుకే వీళ్లను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వీటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే అన్ని జిల్లాల్లో మంత్రులు ఉంటే పార్టీకి కలిసొస్తుందని హైకమాండ్ భావిస్తోంది. ఉగాది పండుగ రోజున మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సమాచారం అందుతోంది. మార్చి 27తో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆ తర్వాత ఉగాది రోజున లేదంటే పండుగకు ఒకరోజు అటు ఇటుగా కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది.
Also Read: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి.. అభ్యర్థుల పిటిషన్
Also Read : ఇట్స్ IPL టైం.. అమెజాన్ EPL సేల్ స్టార్ట్- ఫోన్లు, టీవీలు, ప్రొజెక్టర్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు!
rtv-news | cabinet-expansion | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates | telangana-cabinet