/rtv/media/media_files/2025/04/05/jSi0bbBHm6RmnbFqeCXf.jpg)
missing
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ కుటుంబానికి చెందిన మరో వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులు తమ ముగ్గురు పిల్లలతో పాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు కూడా అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Ap Weather Report: ఆ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే..
మహేశ్ బోయిన్‌పల్లిలో నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉమా వాళ్ల ఇంటికి సంధ్య అనే మహిళ గురువారం ఉదయం వెళ్లారు. మహేశ్, ఉమా దంపతులు తమ పిల్లలు రిషి, చైతు, శివన్‌లతో పాటు సంధ్యను కూడా తమతోపాటు బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించారు.
ఆరుగురు కుటుంబ సభ్యులు బయటకు వెళ్లినట్లు ఇంటి యజమాని ఫిర్యాదు చేసిన వ్యక్తికి చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకేసారి ఆరుగురు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆటో బుక్ చేసుకుని బోయిన్పల్లి నుంచి ఇమ్లీబన్ బస్‌స్టాప్ వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇమ్లీబన్ బస్‌స్టాప్ నుంచి ఆ ఆరుగురు ఎటువైపు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమా సోదరుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు అదృశ్య కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
crime | secundrabad | missing | family | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates