/rtv/media/media_files/2025/02/11/79oP6Lskco7TOKfLZrdD.jpg)
vandhe bharat smoke
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని స్పెషల్స్, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) లో ఉండటం వల్ల వాటికి రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరగా గమ్యస్థానాలకు చేరడానికి ప్రయాణికులు వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు.
Also Read:BIG BREAKING: బ్రిటన్ ప్రధానికి హెచ్‌ఐవీ టెస్ట్.. !
ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో భద్రత కొరవడిందనే అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం - సికింద్రాబాద్ (Visakhapatnam - Secunderabad) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన దీనికి అద్దం పట్టింది. భద్రత గురించి ప్రయాణికుల్లో ఉన్న ఆందోళనను రెట్టింపు చేసినట్టయింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టాయ్‌లెట్‌లో ఓ ప్రయాణికులు సిగరెట్ తాగినట్లు సమాచారం.
Also Read: Sri Lanka: ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్ కట్.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?
తాను కూడా ఇబ్బంది పడ్డానంటూ..
ఈ పొగ మొత్తం ఆ కోచ్‌లో వ్యాపించింది. సిగరెట్ పొగ ఘాటుతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మహిళలు, వయోధిక వృద్ధులు మరింత ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయాన్ని టీసీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని ప్రయాణికులు చెబుతున్నారు. సిగరెట్ పొగ ఘాటు వల్ల తాను కూడా ఇబ్బంది పడ్డానంటూ టీసీ ప్రయాణికులతో చెప్పడం ఈ వీడియోలో స్పష్టంగా వినపడుతుంది. రెండు నిమిషాలు ఈ రైలును నిలిపివేసి డోర్లను తీయాలంటూ కొందరు ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.
విశాఖ హైదరాబాద్ వందే భారత్ రైలు టాయిలెట్ లో సిగరెట్ త్రాగిన వ్యక్తి, బోగీలో పొగలు.
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) February 10, 2025
టిక్కెట్ కండక్టర్ ను నిలదీసిన ప్రయాణికులు. నేనేమి చేస్తాను అంటూ టీసి ఎదురు ప్రశ్న! #Smoking #VandeBharat #Vizag #Hyderabad #Railways #AndhraPradesh #UANow #Visakhapatnam #Secunderabad pic.twitter.com/qJm9pnHVzO
సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిస్తోన్న 20707/20708 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తోన్న రైలు ఇది. అత్యంత ఆదరణ ఉండే సర్వీసుల్లో ఇదీ ఒకటి. అలాంటి ప్రజాదరణ ఉన్న ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
Also Read:LUMPY SKIN VACCINE:లంపీ స్కిన్ వ్యాధి - టీకా కనుగొన్న భారత్ బయోటెక్